బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. "రాఖీ సావంత్ జిమ్ కు హిజాబ్‌తో వచ్చింది" ("Rakhi Sawant arrives in Hijab at the gym,") అని క్యాప్షన్ ఉంది.
ఆ పోస్టుకు 328 k లైక్‌లు, 3.9 మిలియన్ల వీక్షణలు, 42k షేర్ లు వచ్చాయి. 'AIMIM అంబర్‌పేట్ నియోజకవర్గం' Facebook పేజీలో వీడియో అప్లోడ్ చేయబడింది. కర్ణాటకలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా నటి హిజాబ్ ధరించిందనే అభిప్రాయం కలిగించేలా ఈ పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ ఈ ఘటనపై కీవర్డ్ సెర్చ్ చేయగా.. టైమ్స్ ఆఫ్ ఇండియా రాఖీ సావంత్ హిజాబ్ తో ఉన్న ఫోటోలను Times of India ఆగష్టు 31, 2021న పోస్టు చేసింది. "Rakhi Sawant arrives in Hijab at the gym, comments on Sunny Leone's entry into Bigg Boss OTT." అంటూ కథనాన్ని రాసింది.
'Filmydrama' అనే పేజీలో రాఖీ సావంత్ హిజాబ్ ను ధరించి జిమ్ కు వెళ్లినట్లు ఆగష్టు 30, 2021న వీడియోను పోస్టు చేశారు. "Rakhi Sawant Ne Pahna Hijab... Rakhi Arriving In Weirdest Workout Outfit!... Sunny Leone Ke Bigg Boss OTT ke ghar me jane par boli ye bat " అంటూ పోస్టును పెట్టడం గమనించవచ్చు.
పలు మీడియా సంస్థలు, సోషల్ మీడియా పేజీలు అప్పట్లో రాఖీ సావంత్ జిమ్ కు హిజాబ్ తో వెళ్లిన వీడియోలను, ఫోటోలను అప్లోడ్ చేశాయి. హిజాబ్ వివాదానికి రాఖీ సావంత్ కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
కాబట్టి, రాఖీ సావంత్ హిజాబ్ కు మద్దతు తెలిపిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.