FactCheck : వైరల్ అవుతున్న వీడియోకు పఠాన్ సినిమాకు సంబంధం ఉందా..?

Old video of moviegoers' reaction to SRK's 'Zero' passed off as audience response to 'Pathaan'. షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా అడ్వాన్స్‌డ్ టికెట్ విక్రయాలలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jan 2023 10:53 AM GMT
FactCheck : వైరల్ అవుతున్న వీడియోకు పఠాన్ సినిమాకు సంబంధం ఉందా..?
షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా అడ్వాన్స్‌డ్ టికెట్ విక్రయాలలో కొత్త రికార్డులను సృష్టించింది.

సినిమా రిలీజ్ అయినప్పటి నుండి థియేటర్ నుంచి జనం బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతూ ఉంది. వీడియోలో షారుఖ్ ఖాన్ సినిమా బాగాలేదని అందరూ చెబుతూ వస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో జనం దాదాపుగా నెగటివ్ రివ్యూలను ఇస్తూ వస్తున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వీడియోకు పఠాన్ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు.

న్యూస్‌మీటర్ బృందం వైరల్ క్లిప్ 2018 నాటిదని.. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ నటించిన “జీరో” సినిమాకు సంబంధించిన రివ్యూ ఇదని కనుగొంది.


మేము వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఇది 21 డిసెంబర్ 2018న ధృవీకరించబడిన YouTube ఛానెల్ ఫిల్మీఫీవర్ ద్వారా ప్రచురించబడిన “జీరో” చిత్రం పబ్లిక్ రివ్యూకు సంబంధించిన వీడియోకి దారితీసింది.

7.21 నిమిషాల నిడివిగల వీడియో జీరోపై సినీ ప్రేక్షకుల మిశ్రమ అభిప్రాయాలను చెబుతూ వచ్చారు. దాదాపు 2.31 నిమిషాల సమయంలో, వైరల్ క్లిప్ ఈ వీడియోలో కనిపిస్తుంది.

వైరల్ క్లిప్ 2018 నాటిదని.. షారుఖ్ ఖాన్ చిత్రం "జీరో"పై ప్రజలు తమ అభిప్రాయాలను చెబుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పఠాన్ రివ్యూకు సంబంధించిన వీడియో ఇది కాదని తెలుస్తోంది. వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.


Claim Review:వైరల్ అవుతున్న వీడియోకు పఠాన్ సినిమాకు సంబంధం ఉందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story