FactCheck : ఇండోనేషియాలో భూకంపం వస్తున్నా కూడా ఇమామ్ ప్రార్థనలు చేశారా..?

Old video of Imam praying during an earthquake falsely linked to recent Indonesia temblor. భారీ ప్రకంపనల సమయంలో కూడా ఓ వ్యక్తి మసీదులో ప్రార్థిస్తున్న వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2022 6:19 PM IST
FactCheck : ఇండోనేషియాలో భూకంపం వస్తున్నా కూడా ఇమామ్ ప్రార్థనలు చేశారా..?

భారీ ప్రకంపనల సమయంలో కూడా ఓ వ్యక్తి మసీదులో ప్రార్థిస్తున్న వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.

2022 నవంబర్ 21న పశ్చిమ ఇండోనేషియాలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా.. పశ్చిమ జావాలోని సియాంజూర్‌లో వందల మంది చనిపోయారు. ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని వైరల్ వీడియో విస్తృతంగా షేర్ చేయబడింది.

వైరల్ వీడియోలో, ఒక ఇమామ్‌తో పాటు చాలా మంది మసీదులో ప్రార్థనల్లో పాల్గొనడం చూడవచ్చు. భయంకరమైన ప్రకంపనలు ఉన్నాయి. అందరూ గందరగోళంలో పరుగెత్తగా.. ఇమామ్ ప్రార్థన కొనసాగించారు. పరుగెత్తడానికి నిరాకరించారు. ఇమామ్ ను అనుసరించి, మరో ఇద్దరు అక్కడే ఉండిపోయారు.

ఇండోనేషియాలో ఇటీవల 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ సమయంలో ఇది చోటు చేసుకుంది అంటూ పలువురు పోస్టులు పెట్టారు. '#Earthquake of 5.6 magnitude hits Indonesia, 56 died and700 injured so far. worshipers continued to pray Salah. SubhanAllah. May Allah bless them and have mercy on them.' అంటూ ట్వీట్లు చేశారు.

నిజ నిర్ధారణ :

NewsMeter బృందం వీడియో మూలాన్ని కనుగొనడానికి కీఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ లను అమలు చేసింది. మేము అదే వైరల్ క్లిప్ పూర్తి వెర్షన్‌ను 4 సంవత్సరాల క్రితం ప్రచురించడాన్ని గుర్తించాము. ది గార్డియన్, BBC న్యూస్ యొక్క అధికారిక ఛానెల్‌లో వీడియోను కనుగొన్నాము.

'భూకంపం సమయంలో ఇండోనేషియా ఇమామ్ బాలిలో ప్రార్థనలు కొనసాగిస్తున్నాడు' అనే శీర్షికతో వైరల్ వీడియో 6 ఆగస్టు 2018న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. "Footage of an imam reciting evening prayers in Bali while a deadly earthquake struck the neighboring island of Lombok has gone viral, with people praising him for his unwavering faith." అంటూ గార్డియన్ సంస్థ కథనాన్ని తెలిపింది.


BBC నివేదికలో.. "ముషోల్లా అస్-స్యుహదా మసీదు ప్రతినిధి BBC న్యూస్ ఇండోనేషియన్‌తో మాట్లాడుతూ, ఆరాధకులు భారీగా శబ్దాలు విన్నారని, కాబట్టి మేము పరిగెత్తాము. అరాఫత్ అనే ఇమామ్ మాత్రం వెళ్లలేదని తెలిపారు". "A spokesman for the Musholla As-Syuhada mosque told BBC News Indonesian that worshippers heard sounds from "the ceiling and the roof like it was going to fall, so we ran. The imam, named Arafat, stayed as he believed " అని బీబీసీకి చెప్పుకొచ్చారు.

చివరగా, ఔట్‌లుక్‌లో నివేదించబడిన అదే సంఘటనను కూడా మేము కనుగొన్నాము, ఆ వీడియో 4 సంవత్సరాల పాతది, అది ఇండోనేషియాలోని బాలిలో సంభవించిన భూకంపానికి సంబంధించింది. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఇటీవలిది కాదు.

కాబట్టి, వైరల్ అవుతున్న కథనాల్లో ఎలాంటి నిజం లేదు.


Claim Review:ఇండోనేషియాలో భూకంపం వస్తున్నా కూడా ఇమామ్ ప్రార్థనలు చేశారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story