FactCheck : అసని తుఫాను సమయంలో హోటల్ లోని ఫర్నీచర్ మొత్తం కొట్టుకుపోయిందా..?

Old Video of Heavy Rains in Hubli Shared as Cyclone Asani lashing AP. బలమైన గాలులకు ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్ ఎగిరిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

By Medi Samrat  Published on  18 May 2022 9:00 PM IST
FactCheck : అసని తుఫాను సమయంలో హోటల్ లోని ఫర్నీచర్ మొత్తం కొట్టుకుపోయిందా..?

బలమైన గాలులకు ప్లాస్టిక్ కుర్చీలు, టేబుల్స్ ఎగిరిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అసని తుఫాను సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనే వాదనతో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతోంది. ఆంధ్ర తీరప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయని, గాలుల తీవ్రత చాలా ఉందంటూ ప్రముఖ మీడియా సంస్థ ఎన్‌డిటివి కూడా ఈ వీడియోను షేర్ చేసింది.

ఇతర సోషల్ మీడియా వినియోగదారులు ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నిజ నిర్ధారణ :

NDTV చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ... న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జర్నలిస్ట్ అరుణ్‌కుమార్ హురలిమత్ ఒరిజినల్ వీడియో కర్ణాటకలోని హుబ్లీకి చెందినదని చెప్పారు. అదే వీడియోను మే 5న పోస్ట్ చేశారు కూడా. హుబ్లీ విమానాశ్రయ క్యాంటీన్‌ దగ్గర భారీ వర్షాలు కురుస్తున్నాయని.. గాలి కూడా ఎక్కువగా ఉందని చెప్పారు.

ఈ వీడియోను హుబ్లీలో తీశారని పేర్కొంటూ పలువురు ట్విట్టర్ వినియోగదారులు మే 5న అదే వీడియోను షేర్ చేశారు.

స్థానిక వార్తా వెబ్‌సైట్.. Hubbali- Dharwar Infra ఎక్కువ నిడివి ఉన్న వీడియోను ట్వీట్ చేసింది. హుబ్లీ విమానాశ్రయంలో క్యాంటీన్‌ ఇదని పేర్కొంది. Hubbali Times, న్యూస్ 18 వంటి ఇతర మీడియా సంస్థలు కూడా ఈ వీడియో హుబ్లీ ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్‌లోని వీడియో అని పేర్కొన్నాయి.

NewsMeter బృందం Google Mapsలో హుబ్లీ విమానాశ్రయంలోని క్యాంటీన్ గురించి సెర్చ్ చేసింది. వీడియో విజువల్స్‌ను Google Mapsలో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చింది. వైరల్ వీడియోలో, "డైలీ డే" పోస్టర్‌తో కూడిన ఐస్ క్రీం ఫ్రీజర్‌ను చూడవచ్చు. వైరల్ వీడియోలోని చిత్రం హుబ్లీ ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్ గురించి గూగుల్‌లో ఉన్న చిత్రంతో సరిపోలింది. క్యాంటీన్ షెడ్ రెండు స్తంభాలు, రహదారి అంచున తెల్లటి లాంప్ పోస్ట్ కూడా కనిపిస్తాయి.

వైరల్ వీడియోను ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశాలో అసని తుఫాను దృశ్యాలు అంటూ చెబుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.






























Claim Review:అసని తుఫాను సమయంలో హోటల్ లోని ఫర్నీచర్ మొత్తం కొట్టుకుపోయిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story