ఆంధ్రప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు చెందిన వీడియోను సోషల్ మీడియా యూజర్లు తెగ షేర్ చేస్తున్నారు. నెల్లూరులో గడప గడప కు ప్రభుత్వం ప్రోగ్రామ్‌లో అనిల్ కుమార్ యాదవ్ ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడని వినియోగదారులు పేర్కొన్నారు.
"గడప గడపకు వెళ్ళబోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నీ తరిమి కొట్టిన ముస్లిం సోదరులు మరియు నెల్లూరు ప్రజలు" అంటూ ఆయనను ముస్లింలు చుట్టుముట్టిన వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి.
న్యూస్‌మీటర్ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్ సెర్చ్ నిర్వహించగా, 2020లో ఇలాంటి దృశ్యాలను నివేదించే అనేక వార్తా కథనాలు కనిపించాయి. ఫిబ్రవరి 2020లో మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో పర్యటిస్తున్న అనిల్ కుమార్ యాదవ్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. CAA అంశంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు ముస్లింలు ఆయన్ను చుట్టుముట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
పలు తెలుగు మీడియా సంస్థలు ఈ వీడియోలను గతంలో షేర్ చేశాయి.
ఇదిలా ఉండగా.. వైఎస్సార్‌సీపీ ప్రారంభించిన 'గడప గడపకు మన ప్రభుత్వం'పై వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు ఎదుర్కొన్నట్లు పలు వార్తా కథనాలు వచ్చాయి. ఇటీవల అనిల్ కుమార్ యాదవ్‌ను ముస్లింలు చుట్టుముట్టినట్లు ఎటువంటి నివేదికలు లేవు.
https://telugu.news18.com/news/andhra-pradesh/ap-politics-day-one-gadapa-gadapaku-ycp-government-some-misters-shocked-by-local-people-ngs-1297000.html
https://m.andhrajyothy.com/telugunews/to-ministers-ycp-leaders-ngts-andhrapradesh-182205120351411
కాబట్టి ఈ వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.