FactCheck : తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నీటితో నిండిపోయిందా..?

Old Video of Flooded Iskcon Temple in Mayapur shared as Tirupati Iskcon Temple Submerged In Floodwater. భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వర్షం చేరుకుంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2021 8:26 PM IST
FactCheck : తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నీటితో నిండిపోయిందా..?

భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వర్షం చేరుకుంది. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. చెరువులు కూడా నిండిపోవడంతో ఎన్నో ప్రాంతాల్లోని ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ప్రస్తుతానికి వర్షాలు కాస్త తగ్గినప్పటికీ ఇంకా కోలుకోలేదు. తిరుపతిలో చాలా ప్రాంతాలు ఇంకా నీటమునిగి ఉన్నాయి.


తిరుపతి లోని ఇస్కాన్ ఆలయంలోకి పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటూ కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. వరదలతో నిండిన ఆలయంలో భక్తులు ప్రార్థనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఈ వీడియో తిరుపతి ఇస్కాన్ దేవాలయానికి చెందినదని ప్రచారం జరుగుతోంది.


నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

NewsMeter ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. ఆగస్టు 11, 2015న YouTube ఛానెల్ 'రాధేశ్యామాజీ 108'లో అప్‌లోడ్ చేయబడిన వీడియోని చూపించింది. వీడియో యొక్క శీర్షిక "ఇస్కాన్ మాయాపూర్ వరద ఆగస్టు 2015" అని ఉంది. వైరల్ వీడియోకు సంబంధించిన క్లిప్‌ను 1:08 నిమిషాల సమయం వద్ద చూడవచ్చు.


అచ్చం అలాంటి వీడియోనే YouTube ఛానల్ 'Hare Krsna TV' లో ఆగస్టు 4, 2015 న పోస్టు చేశారు. "Devotees enjoying Flood inside temple hall in Mayapur" అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. వైరల్ వీడియోలోని విజువల్స్ 0:37 సెకన్ల నుండి చూడవచ్చు.


మాయాపూర్ ఇస్కాన్ యాత్ర అనే Facebook పేజీ 8 ఆగస్టు 2020న వరద నీటిలో మునిగిపోయిన మాయాపూర్ ఇస్కాన్ దేవాలయంకు సంబంధించిన అనేక చిత్రాలను అప్‌లోడ్ చేసింది. చిత్రాలలో వైరల్ వీడియోలో కనిపించే విజువల్స్ కూడా ఉన్నాయి.

It is therefore evident that the claim made through the viral post is false. The viral video shows the flooded Mayapur ISKCON temple and not the Tirupati ISKCON temple.

వైరల్ పోస్ట్ లు ప్రజలను తప్పుద్రోవ పట్టించేవని స్పష్టమైంది. వైరల్ అయిన వీడియో తిరుపతి ఇస్కాన్ ఆలయానికి సంబంధించినది కాదని.. వరద ముంపునకు గురైన మాయాపూర్ ఇస్కాన్ ఆలయానికి సంబంధించినదని తెలుస్తోంది.


Claim Review:తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నీటితో నిండిపోయిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Fact Check:False
Next Story