FactCheck : నదిలో వరదలంటూ ఒకప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Old video of flooded bridge shared as recent. భరతపూజ నదిలో వరదల కారణంగా కేరళలోని పట్టాంబి వంతెన మునిగిపోయిందని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2022 3:06 PM IST
FactCheck : నదిలో వరదలంటూ ఒకప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

భరతపూజ నదిలో వరదల కారణంగా కేరళలోని పట్టాంబి వంతెన మునిగిపోయిందని సోషల్ మీడియా వినియోగదారులు వీడియోను షేర్ చేస్తున్నారు.


ఈ వీడియో కేరళకు చెందినదని యూజర్లు పేర్కొంటున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

NewsMeter బృందం వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. 'Mithoon Payyoor' అనే యూట్యూబ్ వీడియోలో 15 ఆగస్టు 2018న వీడియో అప్లోడ్ చేశారని గమనించాము. వీడియోకు "Bharathapuzha Pattambi bridge overflow." అనే టైటిల్ ను ఉంచారు.


న్యూస్‌మీటర్ బృందం ముహమ్మద్ ముహస్సిన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పత్రికా ప్రకటనను కూడా కనుగొంది. పత్రికా ప్రకటనను అనువదించగా "మలంపూజ డ్యామ్ గేట్లు తెరుచుకునే అవకాశం ఉంది. జిల్లా కార్యాలయం-పాలక్కాడ్ నుండి సమాచారం అందింది" అని తెలిపారు.

దానిని క్లూగా తీసుకుని, 16 జూలై 2022న డ్యామ్ షట్టర్లు తెరిచినట్లు మాకు ఒక నివేదిక వచ్చింది. ముక్కాయిపూజ, కల్పతిపూజ, భరతపూజ (నిలా నది) ఒడ్డున ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే ఒకప్పటి వీడియోనే ఇటీవలిది అంటూ వైరల్ చేయడం మొదలుపెట్టారు.

9 ఆగస్టు 2019న పట్టాంబి వంతెనకు సంబంధించి ANI చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము. మేము వాటిని వైరల్ వీడియో కీఫ్రేమ్‌లతో పోల్చగా చిత్రాలు ఒకేలా కనిపించాయి.

ట్వీట్ లో "Kerala: Traffic movement, through Pattambi bridge, stops. The bridge is flooded as Bharathappuzha river is overflowing" అని ఉంది.

వరదల తర్వాత పట్టాంబి వంతెన పరిస్థితిపై మాకు చాలా కథనాలు దొరికాయి. అవన్నీ 2018-19లో అప్‌లోడ్ చేయబడ్డాయి.

9 ఆగస్టు 2019 నాటి ది హిందూ నివేదిక ప్రకారం, "జిల్లాలోని చాలా నదులు, ముఖ్యంగా భరతపూజ, కల్పతిపూజ, కుంతిపూజ ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. నదుల ఒడ్డున నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు." అని ఉంది.

https://www.google.com/amp/s/indianexpress.com/article/cities/thiruvananthapuram/kerala-rains-live-updates-alert-landslides-8063127/lite/

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎలాంటి నిజం లేదు'.


Next Story