ఓ వ్యక్తి స్కూటర్‌పై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్న ఇతర డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హిట్ అండ్ రన్ చట్టంలో కొత్త శిక్షను ప్రకటించిన తర్వాత స్కూటర్ రైడర్ ట్రక్కు డ్రైవర్ ముందు ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టు వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులు క్లెయిమ్ చేస్తున్నారు.
భారతీయ శిక్షాస్మృతి స్థానంలో కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలో హిట్-అండ్-రన్ సంఘటనలలో సవరించిన జరిమానాల నేపథ్యంలో వీడియోతో పాటు దావా వచ్చింది. ఒక నిందితుడు ప్రాణాంతకమైన క్రాష్‌కు కారణమై, అధికారులకు నివేదించకుండా సంఘటన స్థలం నుండి పారిపోతే, జరిమానాతో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని కొత్త చట్టం నిర్దేశిస్తుంది.
“#truckdriver Dirty act of the bike driver...Public harassing truck drivers after new law is made, (sic)” అంటూ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది బైక్ డ్రైవర్ తప్పిదమని.. అయితే కొత్త చట్టాల కారణంగా ట్రక్ డ్రైవర్లు ఇబ్బందులు పడతారని అందులో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో అక్టోబర్ 2023 నాటిదని.. కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి తప్పుగా లింక్ చేశారని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను చేయగా.. అక్టోబర్ 27, 2023న మాతృభూమి మీడియా సంస్థ నివేదికను కనుగొన్నాము. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన కల్లాయికి చెందిన ఫర్హాన్‌గా గుర్తించారు.
నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, బస్సు ముందు స్కూటర్‌పై స్టంట్‌స్ చేస్తున్నాడని మీడియా సంస్థ తెలిపింది. తాగి డ్రైవింగ్, స్కూటర్ స్టంట్‌లకు పాల్పడినందుకు ఫరాహాన్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని కేరళ మోటార్ వెహికల్స్ డిపార్ట్‌మెంట్ (MVD) నిర్ణయించిందని మీడియా సంస్థ తెలిపింది.
కేరళ కౌముది కూడా అదే తేదీన ఈ సంఘటనను నివేదించింది. వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌లను, అదే వివరాలను తెలియజేసారు.
కేరళ మోటార్స్ వెహికల్ డిపార్ట్‌మెంట్ అక్టోబర్ 29, 2023న ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయవద్దని ప్రజలను అభ్యర్థించింది.
అందువల్ల, ఈ వైరల్ వీడియో పాతదని.. కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam