FactCheck : డాక్టర్ కుప్పకూలిపోయిన ఘటన ఇటీవలే చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్..!

Old Video of Doctor Suffering Heart Attack in Bengaluru Shared as Recent. గుండెపోటుతో ఓ డాక్టర్ కుప్పకూలిపోయిన వీడియో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 April 2022 9:33 AM GMT
FactCheck : డాక్టర్ కుప్పకూలిపోయిన ఘటన ఇటీవలే చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్..!

గుండెపోటుతో ఓ డాక్టర్ కుప్పకూలిపోయిన వీడియో వైరల్‌గా మారింది. ముంబైలోని వినాయక ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.

1.02 నిమిషాల CCTV వీడియోలో ఒక మహిళా డాక్టర్ అకస్మాత్తుగా నేలపై కుప్పకూలింది. ఆమె రిజిస్టర్‌పై సంతకం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. CCTV ఫుటేజీలో తేదీ 11-26-2017గా పేర్కొనబడింది.

https://www.facebook.com/groups/204541026387890/posts/2147830185392288/

"ముంబయిలోని వినాయక్ హాస్పిటల్‌లోని సిసిటివి ఫుటేజీ" అనే శీర్షికతో వైరల్ వీడియో షేర్ చేయబడుతోంది. స్పెషలిస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్. సునీత రౌండ్స్‌లో ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించారు. ఆమె సిబ్బందికి కూడా ఏమి చేయాలో తెలీలేదు. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అసలు ఊహించలేము" అంటూ పోస్టులు పెట్టారు.

"CCTV footage of Vinayak hospital, Mumbai. Dr. Sunitha, a specialist Cardiologist, died due to a massive heart attack while on rounds, leaving no time even for her staff to do anything. Nothing in life is certain..." అని ఉన్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

నిజ నిర్ధారణ :

NewsMeter సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంబంధిత కీవర్డ్స్ సెర్చ్ ను అమలు చేసింది. 2018 నుండి ఇదే వీడియో వైరల్‌గా ఉందని మేము కనుగొన్నాము. కర్ణాటకలోని బెంగళూరులోని వినాయక ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగిందని పేర్కొంటూ కొన్ని పోస్ట్‌లను గతంలో చేయడాన్ని కూడా కనుగొన్నాము.

ఇక నవంబర్ 26, 2017న పోస్ట్ చేసిన అదే వీడియో "హాస్పిటల్‌లో భారీ గుండెపోటుతో కుప్పకూలిన డాక్టర్" అనే శీర్షికతో న్యూస్‌ఫ్లేర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడినట్లు మేము కనుగొన్నాము.

"ఆమె పనిచేస్తున్న ఆసుపత్రిలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. భారతదేశంలోని బెంగుళూరులోని వినాయక ఆసుపత్రిలో తన రౌండ్లలో భాగంగా రిజిస్టర్‌పై వైద్యురాలు డాక్టర్ సునీత సంతకం చేస్తున్నట్లుగా ఒక CCTV ఫుటేజ్ చూపిస్తుంది. ఆమె అకస్మాత్తుగా పక్కకు వాలిపోయింది. ఆమెకు సహాయం చేయడానికి ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కూడా ఫుటేజీలో చూపబడింది."

ఇది సంఘటనను ధృవీకరిస్తూ ఆసుపత్రికి చెందిన ఒక ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించింది. "భారీ గుండెపోటుతో డాక్టర్ సునీత కుప్పకూలిపోయిందని ఆసుపత్రి ప్రతినిధి డాక్టర్ భరత్ చెప్పారు" అని న్యూస్‌ఫ్లేర్ నివేదించింది. "మేము ఆమెను ICUకి తరలించి, ఇంట్రాకార్డియాక్ ఇంజెక్షన్‌తో సహా సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను అందించాము. కానీ ఆమె స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె డయాబెటిక్, అధిక చక్కెర స్థాయి ఉంది. కానీ ఆమె తన పరిస్థితి గురించి ఆసుపత్రికి వెల్లడించలేదునే వివరణ ఇచ్చింది ఆసుపత్రి యాజమాన్యం.

కాబట్టి వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి.

Claim Review:డాక్టర్ కుప్పకూలిపోయిన ఘటన ఇటీవలే చోటు చేసుకుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story