ఇటీవల మాండౌస్ తుఫాను పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. డిసెంబర్ 9 రాత్రి తమిళనాడులో తీరం దాటిన తర్వాత, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిలలో కూడా వర్షపాతం నమోదైంది. అయితే ఈ తుఫానుకు సంబంధించి తప్పుడు వాదనలతో అనేక వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ-ఉప్పాడ బీచ్‌లో మాండౌస్ తుఫాను ఉగ్రరూపం దాల్చిందని.. సముద్రంలో పడవ బోల్తా పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
NewsMeter వీడియో కీఫ్రేమ్స్ కు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశారు. 2 ఆగస్టు 2022న జీ మలయాళం ప్రచురించిన నివేదికలో అదే వీడియోను కనుగొన్నాము. ఈ వీడియో కేరళలోని కొల్లంలోని నీందకర వద్ద జరిగిన పడవ ప్రమాదానికి సంబంధించినది తెలుసుకున్నాం.
మేము 1 ఆగస్టు 2022న ETV మలయాళం ప్రచురించిన కథనంలో వీడియోను కూడా కనుగొన్నాము. కథనం ప్రకారం, ఈ ప్రమాదం 1 ఆగస్టు 2022న సాయంత్రం 5:30 గంటలకు జరిగింది. కేరళలోని కొల్లంలోని నీందకర వద్ద సముద్రపు అలల తాకిడికి పడవ బోల్తా పడడంతో నలుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారని కూడా తెలిపింది. అయితే మరో బోటులోని మత్స్యకారులు వారిని రక్షించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఇండియా టుడే మలయాళం, 2 ఆగస్టు 2022న యూట్యూబ్‌లో కూడా అప్లోడ్ చేసింది. కేరళలోని కొల్లంలోని నీందకర వద్ద పడవ బోల్తా పడినట్లు వీడియోలో చెప్పారు.
పడవ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఆగస్టు 2022 నాటిదని, అది కేరళలో చోటు చేసుకుందని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మాండౌస్ తుఫాను కారణంగా పడవ ప్రమాదం జరిగినట్లు చెబుతున్న వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేది.