FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?

రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 17 April 2024 5:45 PM IST

FactCheck : తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?

రద్దీగా ఉండే రోడ్డులో ఆకుపచ్చ చొక్కా ధరించిన మరో వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాడికి గురైన వ్యక్తి బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజు అని వీడియోను షేర్ చేస్తున్న వారు చెబుతూ ఉన్నారన్నారు. ఇటీవల అతని ఇంటి ముందు దారుణంగా దాడికి గురయ్యారని పేర్కొన్నారు.


“తమిళనాడు: బీజేపీ ఐటీ & సోషల్ మీడియా సెల్ జిల్లా కార్యదర్శి రాజేష్ బిజుని నిన్న సాయంత్రం అతని ఇంటి ముందు దారుణంగా కొట్టారు. రాజేష్ చెన్నై తూర్పు నంగనల్లూరులోని శ్రీ చక్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ” అని వీడియోను షేర్ చేశారు ఒక X వినియోగదారుడు.

చాలా మంది X వినియోగదారులు.. వైరల్ అవుతున్న వాదనతోనే వీడియోను షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

2023లో చెన్నైలోని నంగనల్లూర్‌లో బీజేపీలోని రెండు వర్గాల మధ్య జరిగిన పోరును చూపుతున్నందున ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది.

గ్రేటర్ చెన్నై పోలీసు అధికారిక X హ్యాండిల్ లో వీడియోను షేర్ చేస్తున్న వినియోగదారులకు సమాధానమిచ్చారు. ఈ సంఘటన జూలై 31, 2023న నంగనల్లూరులో జరిగిందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.

సన్ న్యూస్ X హ్యాండిల్ వీడియోను ఆగస్ట్ 1, 2023న పోస్ట్ చేసిందని కూడా మేము కనుగొన్నాము. ఆ పోస్ట్‌తో పాటుగా ఉన్న క్యాప్షన్‌లో చెన్నై తూర్పు జిల్లా BJP ప్రధాన కార్యదర్శి SS సుబ్బయ్య తన పార్టీ సభ్యుడు రాజేష్ బిజుపై దాడి చేశారని పేర్కొంది.

ఆగస్టు 1, 2023 న ETV భారత్ నివేదిక ప్రకారం సుబ్బయ్య తన స్నేహితులతో మద్యం సేవిస్తున్న వీడియో వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను బిజూ సర్క్యులేట్ చేశారని సుబ్బయ్య ఆరోపిస్తూ నంగనల్లూరులోని అతనిపై దాడి చేశారు.

తమిళ మీడియా సంస్థ దినకరన్, ఆగస్ట్ 1, 2023న ప్రచురించిన ఒక నివేదికలో, బిజూ క్రోమ్‌పేట్‌లో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ దాడి చేసినందుకు సుబ్బయ్యపై కేసు నమోదు చేసినట్లు కూడా పేర్కొంది.

అందువల్ల, ఈ సంఘటన 2023 నాటిది. బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యుల మధ్య వివాదానికి సంబంధించినది. కాబట్టి ఈ వాదన తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:తమిళనాడులో బీజేపీ నాయకుడిపై ఇటీవల దాడి చేశారా?
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X, Facebook
Claim Fact Check:Misleading
Next Story