FactCheck : విక్రమ్ వైరల్ వీడియో ఇప్పటిది కాదా..?

Old video of Actor Vikram Falsely linked to his hospitalization. తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 July 2022 6:38 PM IST
FactCheck : విక్రమ్ వైరల్ వీడియో ఇప్పటిది కాదా..?

తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తన అభిమానులు చూపించిన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


కింది లింక్స్ ను క్లిక్ చేయండి :

https://archive.ph/rrMaD

https://archive.ph/BYK4f

https://archive.ph/S7CuI

https://archive.ph/NNWEz

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.

NewsMeter బృందం YouTubeలో "Chiyaan Vikram thanks fans birthday" అంటూ కీవర్డ్ శోధనను నిర్వహించింది. 'Chiyaan Vikram thanks his fans on his birthday.' అనే శీర్షికతో ఏప్రిల్ 18, 2017న ధృవీకరించబడిన ఛానెల్ అప్‌లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.

వీడియోను పరిశీలించగా.. కొన్ని సెకన్ల పాటూ.. వైరల్‌గా ఉన్నటువంటి కీఫ్రేమ్‌లను కనుగొన్నాము. వీడియోలో, విక్రమ్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మనం చూడవచ్చు. "హాయ్ మీరు నా పట్ల చాలా ఆప్యాయత, చాలా ప్రేమ చూపిస్తున్నారు... ఇది నా బెస్ట్ పుట్టినరోజు మీకు ధన్యవాదాలు చెబుతున్నాను...." అని విక్రమ్ వీడియోలో చెప్పడం వినవచ్చు.



మేము విక్రమ్ సోషల్ మీడియా అకౌంట్ ను కూడా శోధించాము. అదే వీడియో ఏప్రిల్ 17, 2017 న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయబడిందని కనుగొన్నాము.



ఇంకా ఏప్రిల్ 18, 2017న ధృవీకరించబడిన ఛానెల్ IndiaGlitz Tamil ద్వారా YouTubeలో అప్‌లోడ్ చేయబడిన మరొక వీడియోను మేము కనుగొన్నాము 'Vikram overwhelmed: thanks fans for the love and support | Birthday celebration, Sketch Movie.' అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు.


"చియాన్ విక్రమ్ యొక్క ధృవ నచ్చతిరమ్ రెండవ టీజర్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా (ఏప్రిల్ 17వ తేదీ) విడుదలైంది. తన అభిమానుల నుండి వచ్చిన స్పందనతో ఉబ్బితబ్బిబ్బైన నటుడు, తన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను పంచుకున్నారు. " వీడియో వివరణలో ఉంది.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఇది ఒకప్పటి వీడియో అని మా టీమ్ గుర్తించింది.













































Claim Review:విక్రమ్ వైరల్ వీడియో ఇప్పటిది కాదా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story