నేపాల్ లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నేపాల్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో అని, మూడు దశాబ్దాలలో జరిగిన ఘోర విమాన ప్రమాదం అని చెబుతున్నారు.
జనవరి 15న నేపాల్‌లోని పోఖారాలో యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన దేశీయ విమానం కూలిపోవడంతో 72 మంది మరణించారు.
ఈ వీడియో ఇటీవలి నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించినదని పలువురు ట్విట్టర్ వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో చాలా పాతదని న్యూస్ మీటర్ బృందం నిర్ధారించింది.
Yandexలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మే 1, 2013 నుండి "747 కార్గో ప్లేన్ బాగ్రామ్ ఎయిర్‌బేస్ వద్ద క్రాష్ అయ్యింది"(“747 cargo plane crashes at Bagram airbase.”) అనే శీర్షికతో ది గార్డియన్ నివేదిక కనిపించింది. ఇది వైరల్ క్లిప్ కంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియోను కూడా గుర్తించాం.
నివేదికలో “సోమవారం ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ ఎయిర్‌బేస్ నుండి వెళుతున్నప్పుడు బోయింగ్ 747 US కార్గో విమానం కూలిపోయిన క్షణాలు ఆ ఫుటేజ్ లో ఉన్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం ఏడుగురు అమెరికన్ సిబ్బంది మరణించారు. ఈ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ క్రాష్‌పై దర్యాప్తు చేస్తోంది." అని అప్పట్లో కథనాలు వచ్చాయి.
మేము CNN, CBS న్యూస్‌లలో ఇలాంటి వీడియోలు, మీడియా నివేదికలను కూడా కనుగొన్నాము. ఆ వీడియో ఆఫ్ఘనిస్తాన్‌లోని బాగ్రామ్ ఎయిర్‌బేస్‌లో బోయింగ్ 747 US కార్గో విమానం కూలిపోయిందని నిర్ధారించింది.
ఇటీవల జరిగిన పోఖారా విమాన ప్రమాదం క్లిప్ ను చూడవచ్చు.
వైరల్ అయిన వీడియో ఇటీవల నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించినది కాదని స్పష్టమైంది. కాబట్టి వైరల్ దావా తప్పు.