సైనికుల యూనిఫాంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు గొలుసులతో బంధించి సజీవ దహనం చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను హమాస్ మిలిటెంట్లు హతమార్చినట్లు వీడియో అని పేర్కొంటూ బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ వీడియోను షేర్ చేశారు.
హమాస్ ఉగ్రవాదుల క్రూరమైన చర్యలను చూడండి. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులను గొలుసులతో బంధించి, గన్‌పౌడర్‌లో చుట్టి, నిప్పంటించిన హమాస్ ఉగ్రవాదుల అమానవీయ చర్యలను మనం చూడొచ్చు. ఇప్పటికీ, కొంతమంది దేశద్రోహులు హమాస్‌కు మద్దతు ఇస్తున్నారు. హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడం అత్యవసరం. మనమందరం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాలని పోస్టుల్లో తెలిపారు.
పలువురు ట్విట్టర్ యూజర్లు కూడా అదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వైరల్ వీడియో 2016 నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
2016లో ఇద్దరు టర్కీ సైనికులను సజీవ దహనం చేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) గ్రూప్ కు సంబంధించిన వీడియో అని న్యూస్ మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, 'ఇస్లామిక్ స్టేట్ చిత్రహింసలకు సంబంధించిన కొత్త వీడియోను విడుదల చేసింది, టర్కీ సైనికులను సజీవదహనం చేసింది' అనే శీర్షికతో ABP ఆనంద అనే వెరిఫైడ్ ఛానెల్ డిసెంబర్ 23, 2016న అప్లోడ్ చేసిన వీడియో YouTubeలో మాకు కనిపించింది.
దీన్ని క్యూగా తీసుకొని, మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. NDTV లో వచ్చిన 2016 నివేదికను చూశాము. అందులో వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్ ఉంది. “ISIS Video Shows Turkish Troops ‘Burned Alive.’” అనే టైటిల్ తో వీడియో ఉంది.
నివేదిక ప్రకారం, ఉత్తర సిరియాలోని అలెప్పో ప్రావిన్స్‌లో వీడియోను చిత్రీకరించారు. పట్టుబడిన ఇద్దరు టర్కీ సైనికులను సజీవ దహనం చేయడాన్ని ఇందులో చూపించారు.
న్యూయార్క్ పోస్ట్, ఫాక్స్ న్యూస్ ప్రచురించిన 2016 నివేదికలలో కూడా మేము వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌ను కనుగొన్నాము. సిరియాలో టర్కీ సైనికులను ఐఎస్ఐఎస్ సజీవ దహనం చేసిన వీడియోలో అని రెండు వార్తా సంస్థలు నివేదించాయి.
అందువల్ల, మేము ఈ వీడియో ఇటీవలిది కాదని.. హమాస్ ఇజ్రాయెల్ సైనికులను కాల్చివేసినట్లు చూపించలేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam