బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా కుర్చీలు కొట్టుకు పోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను సైక్లోన్ బైపార్జోయ్‌కి లింక్ చేశారు. ఒక ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేస్తూ, “గుజరాత్, పొరుగు రాష్ట్రాలు 13 నుండి 16వ తేదీ వరకు బైపార్జోయ్ తుఫానును ఎదుర్కొంటున్నాయి... గంటకు 150 కి.మీ వేగంతో చాలా బలమైన గాలి వీస్తోంది, దీనివల్ల ఆస్తులు, భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. పరిస్థితి భయంకరంగా ఉంది కానీ నేను సురక్షితంగా ఉన్నాను. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని మేము ఆశిస్తున్నాము. (sic)” అని చెప్పుకొచ్చారు.
బలమైన గాలుల కారణంగా కుర్చీలు రోడ్డుపై ఎగిరిపోతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. మేము మే 6, 2022 న టైమ్స్ నౌ నివేదికను చూశాము. ఆ నివేదికలో వైరల్ వీడియోకు సంబంధించిన స్టిల్‌ను కలిగి ఉంది. నివేదిక ప్రకారం, వైరల్ వీడియో కర్ణాటకలోని హుబ్బలి విమానాశ్రయానికి సమీపంలో చోటు చేసుకుంది. వర్షాల సమయంలో క్యాంటీన్ నుండి కుర్చీలు, బల్లలు, పాత్రలు గాలిలో ఎగురుతున్నట్లు చూపిస్తుంది.
మే 5, 2022న కర్ణాటకలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చాయని న్యూస్18 నివేదిక పేర్కొంది. హుబ్బళ్లి విమానాశ్రయం సమీపంలోని క్యాంటీన్‌లోని కుర్చీలు, బల్లలు, గాలికి కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ది లాజికల్ ఇండియన్ మే 6, 2022న “హుబ్బల్లి ఎయిర్‌పోర్ట్ క్యాంటీన్‌లో బలమైన గాలి కుర్చీలు, టేబుల్స్ ఎగిరిపోతున్నాయి” అనే శీర్షికతో వీడియోను ప్రచురించింది.
వైరల్ వీడియో 2022 నాటిదని, బైపార్జోయ్ తుఫానుతో తప్పుగా లింక్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : MD Mahfooz Alam