Fact Check : స్మృతి ఇరానీ, అసదుద్దీన్ ఓవైసీ ని రహస్యంగా కలిశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!

Old picture of Smriti Irani, Asaduddin Owaisi. జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. భారతీయ జనతా

By Medi Samrat  Published on  1 Dec 2020 3:12 AM GMT
Fact Check : స్మృతి ఇరానీ, అసదుద్దీన్ ఓవైసీ ని రహస్యంగా కలిశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!

జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపించాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే పలువురు అగ్ర నేతలు హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. నవంబర్ 25న యూనియన్ టెక్స్టైల్ మినిస్టర్ స్మృతి ఇరానీ కూడా వచ్చారు.



ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో స్మృతి ఇరానీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కలిసి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవలే ఓవైసీ స్మృతి ఇరానీని కలిశారని ఆ పోస్టుల్లో చెబుతూ ఉన్నారు. సీక్రెట్ గా కలిశారని.. ఎన్నికల గురించి మాట్లాడారని పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు.


#BJP_MIM మొత్తానికి వెలుగులోకొచ్చిన చీకటి మిత్రబంధం

Posted by Madhu Nerella on Sunday, 29 November 2020


#BJP_MIM మొత్తానికి వెలుగులోకొచ్చిన చీకటి మిత్రబంధం" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.


Gut Bandhan? The two bitter rivals - BJP ( Smriti Irani) and AIMIM (Owaisi) deeply engrossed in a serious conversation...

Posted by Aziz Malik on Friday, 10 February 2017


ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ ఉంటారని.. కానీ ఇలా కలిసిపోయి ఉంటారని పలువురు చెబుతూ వస్తున్నారు. బయటకు ఒకలా.. లోపల ఇంకోలా ఈ నేతల తీరు ఉంటుందని విమర్శిస్తూ ఉన్నారు.


What is Asaduddin Owaisi discussing with Smriti Zubin Irani? Mr. Goebbels Amit Malviya should be able to tell.

Posted by Nilanjan Das on Sunday, 29 November 2020


"ఇంతకూ అసదుద్దీన్ స్మృతి ఇరానీతో ఏమి మాట్లాడుతూ ఉన్నారు..?"

అంటూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

స్మృతి ఇరానీ, అసదుద్దీన్ ఓవైసీ ని ఇటీవల రహస్యంగా కలిశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు నిజం కాదు.



Sulabh Panday అనే ట్విట్టర్ యూజర్ ఆగష్టు 23, 2016న ఈ ఫోటోలను పోస్టు చేశారు. అసదుద్దీన్ ఓవైసీ ఓ వైపు భారతీయ జనతా పార్టీ నేతలను విమర్శిస్తూ ఉంటారు. మరో వైపు బీజేపీ నేతలతో కలిసి తిరుగుతూ ఉంటారు అని పోస్టు పెట్టారు.



దీనిపై అప్పట్లోనే అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ రూపంలో రిప్లై ఇవ్వడం జరిగింది. "Your old party MPs didn't attend power looms meeting & UP is on your mind not realizing that Weavers in UP r suffering" అంటూ రీట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ లో చేనేత కార్మికులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారని.. వారి సమస్యల కోసం ఏర్పాటు చేసిన మీటింగ్ కు హాజరైన సమయంలో చోటు చేసుకున్న ఘటన అని ఆయన తెలియజేసారు.



ఆగష్టు 22, 2016న అసదుద్దీన్ ఓవైసీ తన ట్విట్టర్ ఖాతాలో పవర్ లూమ్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో పాల్గొన్న ఫోటోలను అప్లోడ్ చేశారు. ఆయన అప్లోడ్ చేసిన ఫోటోల్లో స్మృతి ఇరానీ కూడా ఉన్నారు. టెక్స్టైల్ మినిస్టర్ ఆమెనే..! వైరల్ అవుతున్న ఫోటోల్లో వారు వేసుకున్న బట్టలు.. అధికారిక ఖాతాలో అసదుద్దీన్ ఓవైసీ వేసుకున్న బట్టలు రెండూ ఒకటే..! కాబట్టి అప్పటి మీటింగ్ కు హాజరవుతున్నప్పుడు తీసిన ఫోటోలు ఇవని స్పష్టంగా తెలుస్తోంది.



ఆ మీటింగ్ లో తాను ఇవ్వాలనుకున్న ప్రెజెంటేషన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఓవైసీ. ఈ మీటింగ్ కు సంబంధించిన కథనాలను పలు మీడియా సంస్థలు పబ్లిష్ చేయడం జరిగింది.

https://timesofindia.indiatimes.com/city/surat/Textile-ministry-to-study-issues-facing-powerloom-sector/articleshow/53820091.cms

http://www.cottonyarnmarket.net/news/news2.php?action=fullnews&id=19648

స్మృతి ఇరానీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ని రహస్యంగా కలిశారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.




Claim Review:స్మృతి ఇరానీ, అసదుద్దీన్ ఓవైసీ ని రహస్యంగా కలిశారంటూ వైరల్ అవుతున్న పోస్టులు..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Factbook, Twitter
Claim Fact Check:False
Next Story