FactCheck : అంబానీ కుటుంబమంతా కలిసి పఠాన్ సినిమా చూసిందా..?

Old photo falsely shared as Ambani family watching ‘Pathaan’ with SRK. షారూఖ్ ఖాన్, ముఖేష్ అంబానీ కుటుంబం, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jan 2023 9:10 PM IST
FactCheck : అంబానీ కుటుంబమంతా కలిసి పఠాన్ సినిమా చూసిందా..?

షారూఖ్ ఖాన్, ముఖేష్ అంబానీ కుటుంబం, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇటీవల విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం ‘పఠాన్‌’ సినిమాను అంబానీ కుటుంబమంతా కలిసి చూసిందని.. అప్పుడు తీసిన ఫోటో ఇదని వాదిస్తున్నారు.


ఒక ట్విట్టర్ వినియోగదారు ఈ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “మీరు థియేటర్లలో సినిమాను బహిష్కరిస్తున్నారు, కానీ అంబానీ కుటుంబం SRKతో కలిసి పఠాన్‌ సినిమాను చూసింది." అని పోస్టు పెట్టారు.

పలువురు ఫేస్ బుక్ వినియోగదారులు ఇదే విషయాన్ని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :


2015లో రిలయన్స్ జియో లాంచ్ సందర్భంగా తీసిన ఫోటో ఇదని NewMeter కనుగొంది.

ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ నిర్వహించినప్పుడు, మేము ఆ ఫోటోను 28 డిసెంబర్ 2015, ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అందించిన నివేదికలో కనుగొన్నాము. ఈ నివేదికలో వైరల్‌ అవుతున్న ఫోటో సహా అనేక ఫోటోలు ఉన్నాయి.


రిలయన్స్ జియో 4G సేవలు 28 డిసెంబర్ 2015న ప్రారంభించారు, ఆరోజు ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ అంబానీ 83వ పుట్టినరోజు.


జియో ఈవెంట్ కు సంబంధించిన ఒక ఫోటోను డిసెంబర్ 28న హిందూస్తాన్ టైమ్స్ ట్వీట్ చేసినట్లు కూడా మేము కనుగొన్నాము. అంబానీ కుటుంబం, AR రెహమాన్‌తో షారుఖ్ ఖాన్ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఫోటోలో ఉంది.

వైరల్ ఫోటో 2015 నాటిది. రిలయన్స్ జియో 4G లాంచ్ సందర్భంగా షారుఖ్ ఖాన్ సెల్ఫీ తీసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, వైరల్ దావాలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.


Claim Review:అంబానీ కుటుంబమంతా కలిసి పఠాన్ సినిమా చూసిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story