FactCheck : వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తండ్రి కాదు

Old man in viral video is not father of FinMin Nirmala Sitharaman. ఓ ఇంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వృద్ధుడిని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jan 2023 5:15 PM IST
FactCheck : వైరల్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తండ్రి కాదు
ఓ ఇంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వృద్ధుడిని కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మలా సీతారామన్ తన తండ్రిని కలిశారని చెబుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.



చాలా మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ఈ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. నిర్మలా సీతారామన్ ఎంతో నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారని షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

వైరల్ వీడియోలో ఉన్న వృద్ధుడు నిర్మలా సీతారామన్ తండ్రి కాదని న్యూస్ మీటర్ గుర్తించింది. ఆయన K. V. కృష్ణన్.. విప్లవాత్మక తమిళ కవి సుబ్రమణ్య భారతియార్ మేనల్లుడు.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, నిర్మలా సీతారామన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 4 డిసెంబర్ 2022న పోస్ట్ చేసిన వీడియోని మేము కనుగొన్నాము. క్యాప్షన్ ప్రకారం.. మంత్రి వారణాసిలోని శివ మడమ్‌ను సందర్శించినప్పుడు మహాకవిభారతీయార్ మేనల్లుడు 96 ఏళ్ల కె.వి.కృష్ణన్‌ను కలిశారు. ఆమె ఈ సమావేశాన్ని కాశీ మరియు తమిళ సంగమంగా కూడా అభివర్ణించారు.

నిర్మలా సీతారామన్ కార్యాలయం కూడా 3 డిసెంబర్ 2022న ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను, వీడియోను ట్వీట్ చేసింది. మహాకవిభారతీయార్ కుటుంబ సభ్యులతో మంత్రి సంభాషించారని, శ్రీ కె.వి.కృష్ణన్ ను కలిశారని తెలిపారు.

ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నిర్మలా సీతారామన్ తండ్రి కోసం వెతికాము. ఆమె తండ్రి పేరు నారాయణన్ సీతారామన్.

వైరల్ వీడియోలో ఆర్థిక మంత్రి కేవీ కృష్ణన్‌ను కలిశారు. ఆమె తండ్రిని కలిసిన ఫోటో కాదని గుర్తించాం.


Next Story