ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాబూల్ ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు బహిరంగంగా ప్రార్థనలను నిర్వహించారనే ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. కాబూల్ ను స్వాధీనం చేసుకున్న వెంటనే తాలిబాన్లు ఇలా ప్రేయర్లు చేశారని ఫోటోలను కొందరు పోస్టు చేస్తున్నారు. బెంగాలీలో పలువురు పోస్టులను పెడుతూ వస్తున్నారు.
https://www.facebook.com/652887662070206/posts/797765900915714
https://www.facebook.com/groups/652887662070206/permalink/797765900915714/
https://www.facebook.com/groups/652887662070206/permalink/797765900915714/
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫోటో ఇప్పటిది కాదు.. చాలా పాతది.
న్యూస్‌మీటర్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అదే ఫోటోను 12 నవంబర్ 2012 న ది అట్లాంటిక్ ప్రచురించిన కథనంలో ఉండడాన్ని కనుగొన్నారు. చిత్రం యొక్క శీర్షిక, "ఆఫ్ఘనిస్తాన్ జలాలాబాద్, శివార్లలోని మసీదు వెలుపల అక్టోబర్ 26, 2012 న ఈద్ అల్-అధా ప్రార్థనలు" అని ఉంది. ఆ ఫోటో అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్‌కు క్రెడిట్ చేయబడింది.
కీవర్డ్ సెర్చ్ లో భాగంగా అసోసియేటెడ్ ప్రెస్ వెబ్‌సైట్‌లో ఈ ఫోటో ఉంది. ఫోటోతో ఉన్న శీర్షిక, "ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, ఆఫ్ఘనిస్తాన్, తూర్పు, అక్టోబర్ 26, 2012 శుక్రవారం తూర్పున జలాలాబాద్ శివార్లలోని మసీదు బయట ఈద్ అల్-అధా ప్రార్థనలు చేశారు" అని ఉంది.
ఈద్ అల్-అధా అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే మతపరమైన పండుగ, ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడిని దేవునికి విధేయత చూపడానికి సిద్ధపడినందుకు గుర్తుగా జరుపుకుంటారు. అసోసియేటెడ్ ప్రెస్ కు చెందిన ఫోటోగ్రాఫర్ రహమత్ గుల్ ఫోటో తీశారు.
కాబట్టి, ఇటీవల కాబూల్ ను సొంతం చేసుకున్నందుకు గానూ తాలిబాన్లు బహిరంగంగా ప్రార్థనలు చేపట్టారు అనే పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.