చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని కాపాడడానికి మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి హెలికాప్టర్ ను తెప్పించి ఇద్దరిని ఆపద నుండి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కాపాడారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
పొంగిపొర్లుతున్న గోదావరి నది నుంచి హెలికాప్టర్‌లో ఇద్దరు వ్యక్తులను రక్షించిన వీడియో అంటూ సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తున్నారు. "ఇద్దరు గొర్రెల కాపరులను రక్షించడంలో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి కెటి రామారావు సహాయం కోరారు. వెంటనే ప్రభుత్వం రెస్క్యూ కోసం హెలికాప్టర్‌ను అందించింది" అని క్యాప్షన్ లో ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను NewsMeter Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. వీడియో టైటిల్‌లో "Kadapa annamaya collapsed, rescue by helicopter." అని ఉంది.
దానిని క్లూగా తీసుకొని, మేము సంఘటనపై మీడియా నివేదికల కోసం వెతికాము. నవంబర్ 2021లో అప్‌లోడ్ చేయబడిన ETV ఆంధ్రప్రదేశ్ వార్తలను కనుగొన్నాము.
"ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చిత్రావతి నది నీటి ప్రవాహంలో చిక్కుకుపోయిన 10 మందిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) Mi-17 హెలికాప్టర్ రక్షించింది" అని హిందూస్తాన్ టైమ్స్ లో ఉంది. నివేదిక వైరల్ వీడియో వంటి చిత్రాలను కలిగి ఉంది.
https://www.hindustantimes.com/india-news/watch-iaf-mi-17-helicopter-rescues-10-people-from-overflowing-chitravati-river-101637392283863.html
ఇక బాల్క సుమన్ చేసిన ట్వీట్ కూడా మాకు దొరికింది. ఆ ట్వీట్‌లో జరిగిన అప్పట్లో జరిగిన సంఘటనను ప్రస్తావించాడు. ఆ ట్వీట్‌ను మేము అనువదించగా.. 'పొంగిపొర్లుతున్న గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని రక్షించేందుకు సోమన్ పల్లి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడామని, వారిని రక్షించేందుకు ప్రభుత్వం హెలికాప్టర్‌ను సమకూర్చిందని' రాసి ఉంది.
2021లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన పాత చిత్రంతో కూడిన తెలంగాణ టుడే కథనాన్ని కూడా ఆయన ట్వీట్ చేశారు.
కాబట్టి, ఇది ఇప్పుడు చోటు చేసుకున్న ఘటన కాదు. వైరల్ అవుతున్న వీడియో 2021లో చోటు చేసుకుంది.