FactCheck : కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే వైఎస్ షర్మిల పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారా.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jan 2024 9:25 PM IST
FactCheck : కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే వైఎస్ షర్మిల పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారా.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ ఆమెను జనవరి 16న పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా చేసింది.

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత షర్మిల ‘గూండాయిజం’ చేస్తున్నారని ఆరోపిస్తూ.. రెండు క్లిప్‌లతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మొదటి క్లిప్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. రెండో క్లిప్‌లో ఆమె పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

ये कांग्रेस का गमछा नहीं, गुंडागर्दी का लाइसेंस है అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల జాయిన్ అవ్వగానే.. ఇలా పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారు అనే వాదనతో వీడియోను వైరల్ చేశారు.

పలు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. జనవరి 4, 2024న మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో షర్మిల అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదటి క్లిప్ లో చూడొచ్చు. రెండవది 2023లో చోటు చేసుకున్న ఘటన.


మల్లికార్జున్ ఖర్గే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ కండువాను అందజేస్తున్నట్లు చూపిన మొదటి క్లిప్ ను మేము గుర్తించాం. జనవరి 4, 2024న కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేసిన వీడియోను మేము గమనించాం.

అదే తేదీన ABP న్యూస్, టైమ్స్ నౌ ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.

రెండవ క్లిప్ కు సంబంధించిన కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను ఏప్రిల్ 24, 2023 న హైదరాబాద్ టైమ్స్ ఆఫ్ ఇండియా అధికారిక హ్యాండిల్ లో పోస్టు చేశారు. షర్మిల పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని క్యాప్షన్ పేర్కొంది. హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీక్ పై ఆమె నిరసన తెలియజేయడానికి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఆమె దూకుడుగా ప్రవర్తించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

పేపర్ లీక్ నిరసనలో షర్మిల పోలీసులను చెంపదెబ్బ కొట్టిందనే క్యాప్షన్‌తో అదే తేదీన NDTV ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము.


అదే తేదీ నుండి NDTV నుండి వచ్చిన మరొక వీడియో నివేదికలో కూడా అదే దృశ్యాన్ని చూడొచ్చు. పోలీసు సిబ్బందితో దూకుడుగా ప్రవర్తించిన షర్మిలను 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపారు.

షర్మిల పోలీసు సిబ్బందితో దూకుడుగా ప్రవర్తిస్తున్నట్లు చూపుతున్న వీడియో ఏప్రిల్ 2023 నాటిదని.. ఆమె జనవరి 4, 2024న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాదని మేము నిర్ధారించాము.

Credit : Md Mahfooz Alam

Claim Review:కాంగ్రెస్ లో జాయిన్ అయిన వెంటనే వైఎస్ షర్మిల పోలీసుల మీదకు దాడికి తెగబడ్డారా.?
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:Misleading
Next Story