FactCheck : అజయ్ దేవగన్ కుమార్తె నైసా దేవగణ్ చనిపోలేదు

Nysa Devgan is alive news about her death by overdose is fake. అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ ఆల్కహాల్ ఓవర్ డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని పలువురు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 July 2023 7:48 PM IST
FactCheck : అజయ్ దేవగన్ కుమార్తె నైసా దేవగణ్ చనిపోలేదు

అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ ఆల్కహాల్ ఓవర్ డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని పలువురు సోషల్ మీడియా యూజర్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఒక పార్టీలో నైసా అతిగా మద్యం సేవించి కుప్పకూలిపోయిందని వైరల్ వీడియోలో పేర్కొన్నారు.



నిజ నిర్ధారణ :

NewsMeter బృందం ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.

నైసా దేవగన్ అకాల మరణాన్ని నివేదించే సంబంధిత మీడియాను కనుగొనడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అయితే ఆమె మరణానికి సంబంధించి ఎలాంటి వార్తా కథనాన్ని మేము కనుగొనలేదు. ప్రధాన స్రవంతి మీడియాలో ఎటువంటి సమాచారం మాకు దొరకలేదు. బాలీవుడ్ సెలబ్రిటీ కుమార్తె అయిన నైసాకు ఏమైనా జరిగితే మీడియా దృష్టికి వచ్చి ఉండేది. అలాంటిదేమీ జరగలేదని స్పష్టంగా తెలుస్తోంది.

మేము నైసా దేవగన్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌ను వెతికాం. ఆమె చాలా కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నట్లు కనుగొన్నాము. పలు పోస్టులను ఆమె షేర్ చేస్తూ ఉంది.

మేము అజయ్ దేవగన్, కాజోల్ ల ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను కూడా పరిశీలించాం. నైసాకు సంబంధించిన వార్త నిజమని సూచించే ఎలాంటి కథనాలను మేము కనుగొనలేదు.

కాజోల్ తన సోషల్ మీడియా పోస్ట్ లలో ఆమె నటించిన వెబ్ సిరీస్ కు సంబంధించినది ఉండగా.. అజయ్ దేవగన్ అకౌంట్ లో అతడికి సంబంధించిన ఫోటో ఉంది.


నైసా యొక్క స్పష్టమైన మరణ వార్తను పంచుకున్న ఫేస్‌బుక్ పేజీ 'బోలీ ఫన్' ను పరిశీలించగా.. ఆ పేజీలో ఏంజెలీనా జోలీ, లీనా జుమానీ మరెంతో మంది ప్రసిద్ధ వ్యక్తుల మరణ వార్తలకు సంబంధించిన నకిలీ పోస్ట్ లను మేము కనుగొన్నాము


పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్స్‌కు గురికావడం ఇదే తొలిసారి కాదు. న్యూస్‌మీటర్ ఇంతకుముందు కూడా నటుడు టైగర్ ష్రాఫ్ మరణంపై ఇలాంటి వీడియోపై ఫ్యాక్ట్ చెక్ చేసింది.

నైసా దేవగన్ క్షేమంగా ఉంది. ఆమె చనిపోయిందంటూ పెట్టిన పోస్ట్‌లు కేవలం బూటకం మాత్రమే.

Credits : Sunanda Naik



Claim Review:అజయ్ దేవగన్ కుమార్తె నైసా దేవగణ్ చనిపోలేదు
Claimed By:Socialmedia Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story