తెలంగాణా తెలుగు మాట్లాడే రాష్ట్రమైనప్పటికీ అన్ని హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో ప్రయాణ సమాచారం, రూట్ మ్యాప్‌లు తెలుగులో అందించడం లేదని సోషల్ మీడియా వినియోగదారులు వాదిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) కేవలం ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో ప్రయాణ సమాచారాన్ని అందిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
"హైదరాబాద్ మెట్రో రైలు: ఎక్కడా ఒక్క తెలుగు అక్షరం దొరకదు.. రూట్ మ్యాప్ మొత్తం ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో రాసి ఉంది.. నవాబులు ప్రయాణించే ప్రదేశమని అనుకోవడం ఖాయం.. ఎంత దారుణం.. హైదరాబాద్‌లో తెలుగువాళ్లు లేరా? ?" అని మెసేజీ వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ :
హైదరాబాద్ మెట్రో రైల్వే విభాగం.. మొత్తం నాలుగు భాషలలో బోర్డులను, రూట్ మ్యాప్ లను తీసుకుని వచ్చింది.
HMR నాలుగు భాషలలో ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు భాషలలో బోర్డులు, రూట్ మ్యాప్‌లను ఏర్పాటు చేసింది.
2017లో మెట్రో రైలు ప్రారంభానికి ముందే నాలుగు భాషా వ్యవస్థ అమలు చేయబడింది. అనేక మీడియా నివేదికల ప్రకారం, మెట్రో ప్రారంభం నుండి తెలుగు, ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ (నగరంలో ఎక్కువ ముస్లిం జనాభా ఉన్నందున) సైన్ బోర్డుల కోసం నిబంధనలను తీసుకుని వచ్చారు.. అదే కొనసాగుతోంది.
https://www.google.com/amp/s/www.news18.com/amp/news/india/no-language-wars-here-hyderabad-metro-to-use-4-languages-1458925.html
మే 2022లో, HMR అధికారిక ట్విట్టర్ ఖాతా మొత్తం నాలుగు భాషలను ప్రదర్శించే సైన్‌బోర్డ్ చిత్రాన్ని షేర్ చేసింది.
రూట్ మ్యాప్, స్క్రీన్‌పై గమ్యం పేరు, కస్టమర్ కేర్ సెంటర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సైన్ వంటి అనేక సంకేతాల బోర్డులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూలో కూడా ప్రదర్శించబడుతున్నాయి.
HMR కేవలం ఉర్దూ మరియు ఆంగ్లంలో మాత్రమే కాకుండా హిందీ మరియు తెలుగులో కూడా సమాచారాన్ని అందిస్తోంది. కాబట్టి, వైరల్ పోస్టులలో ఎటువంటి నిజం లేదు.