Fact Check : ఆఫ్ఘన్ పిల్లలను హక్కున చేర్చుకున్న అమెరికా సైనికులు అంటూ ఫోటో వైరల్..?

Not American But British Soldier Was Pictured Rescuing Baby In Afghanistan. ఓ ఆఫ్ఘన్ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న సైనికుడికి సంబంధించిన ఫోటో సామాజిక

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Aug 2021 4:53 PM IST
Fact Check : ఆఫ్ఘన్ పిల్లలను హక్కున చేర్చుకున్న అమెరికా సైనికులు అంటూ ఫోటో వైరల్..?

ఓ ఆఫ్ఘన్ చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న సైనికుడికి సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అతడు అమెరికాకు చెందిన సైనికుడు అంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.

"US soldier rescuing a baby in Afghanistan. Picture of the day," అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు. ఆఫ్ఘన్ పిల్లలను అమెరికా సైనికులు కాపాడుతున్న ఫోటోలు అంటూ పలువురు ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉన్నారు.

Click here to view a similar claim.

https://www.facebook.com/1418835935012038/posts/3214238165471797/

https://www.facebook.com/328173160682155/posts/1978190092347112/

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటోలు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నాయి.

ఈ వైరల్ అవుతున్న ఫోటోల కింద ఆఫ్ఘన్ పిల్లలను కాపాడుతోంది బ్రిటీష్ సైనికులని.. అమెరికా సైనికులు కాదని తెలిపారు.

ఈ చిన్న క్లూ ఆధారంగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా The Guardian న్యూస్ వెబ్సైట్ లో ఈ ఫోటోను పబ్లిష్ చేశారు.

'Afghans face catastrophe without urgent aid, UN warns' అనే హెడ్ లైన్ తో కథనాన్ని పోస్టు చేశారు. ఆ ఫోటో కింద "A British soldier with a baby at Kabul airport. Photograph:Sky News " అని ఉంది. దీన్ని బట్టి బ్రిటీష్ సైనికుడు ఆ ఫోటోలో ఉన్నాడని అర్థం అవుతోంది.

ఇక ఫోటో తీసింది Sky News అని ఉండగా.. ఇదే ఫోటో Sky News వెబ్సైట్ లో కూడా కనిపించింది. అందులో కూడా అక్కడ ఉన్నది బ్రిటీష్ సైనికుడేనని తెలుపుతూ పోస్టు చేశారు. "Afghanistan: Picture of British troops and the Taliban at Kabul airport" అని అందులో ఉంది.

అందిన సమాచారం ప్రకారం.. Sky News కెమెరామెన్ టోబీ నాష్ కాబూల్ ఎయిర్ పోర్టులో ఈ ఫోటోను తీశారు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో చెప్పినట్లుగా అక్కడ ఉంది అమెరికా సైనికుడు కాదు. బ్రిటీష్ సైనికుడు.


Claim Review:ఆఫ్ఘన్ పిల్లలను హక్కున చేర్చుకున్న అమెరికా సైనికులు అంటూ ఫోటో వైరల్..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Insta, Facebook
Claim Fact Check:Misleading
Next Story