కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) లక్కీ డ్రా 2021 లో 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారని వాట్సాప్ లో పలువురికి మెసేజీలు వస్తున్నాయి. మీరు లక్కీ డ్రాలో భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. అవి మీకు పంపుతున్నాము.. అనే సందేశాన్ని అందుకున్న వారు బహుమతిని క్లెయిమ్ చేయడానికి అందించిన నంబర్‌ను సంప్రదించాలని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ మెసేజీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి. అలా చేయడం వలన మీ కీలక సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది.
ఢిల్లీ సైబర్ సెల్ కూడా ఈ మెసేజ్ పై ప్రజలను అలర్ట్ చేసింది. పర్సనల్ బ్యాంకు నంబర్, పాన్ కార్డు వంటివి సేకరించడానికి ఇలా కాంటెస్ట్ లలో గెలిచారని మెసేజీలు పెడుతున్నారని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకు మీ వివరాలను ఇవ్వకండని హెచ్చరించారు.
ఒక వ్యక్తి తన వ్యక్తిగత బ్యాంక్ సమాచారాన్ని.. అలాంటి సున్నితమైన సమాచారాన్ని తెలియని వాట్సాప్ నంబర్‌కు పంపమని అడిగే సందేశాలు బూటకమని ఢిల్లీ సైబర్ సెల్ స్పష్టం చేసింది. మోసగాళ్లు తెలియని నంబర్‌ల నుండి వాట్సాప్ సందేశాలను పంపుతారు (వారిలో ఎక్కువ మంది +92, పాకిస్తాన్ యొక్క ISD కోడ్) మరియు వారి మొబైల్ నంబర్ కౌన్ బనేగా కరోడ్‌పతి మరియు రిలయన్స్ జియో సంయుక్తంగా నిర్వహించిన లాటరీని గెలుచుకున్నాయని చెబుతూ వస్తోంది. 25 లక్షలు. బహుమతిని క్లెయిమ్ చేయడానికి, సందేశంలో అందించిన నంబర్‌కు కాల్ చేయమని వ్యక్తిని కోరతారు. ఇది తరువాత ఏదో ఒక సాకుతో డబ్బు డిమాండ్ చేసే మోసగాళ్లకు దారితీస్తుంది. బాధితుడు డబ్బును పొందాలని ప్రయత్నించినప్పుడు లేదా డబ్బు చెల్లించడానికి నిరాకరించినప్పుడు వారు కాల్ చేయడం ఆపివేసి, వాట్సాప్ నంబర్‌లను బ్లాక్ కూడా చేయడం జరుగుతుంది.
ఇలాంటి సందేశం వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటివే జరుగుతూ వచ్చాయి. "దయచేసి ఏదైనా కాల్ ద్వారా సున్నితమైన వివరాలను పంచుకోవద్దు. ఇలాంటివి ఏవైనా వస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ ను సందర్శించండి" అని పోలీసులు సూచిస్తున్నారు.
బహుమతిని అందుకోవడానికి ప్రజలు తమ బ్యాంక్ సమాచారాన్ని లేదా ఏదైనా సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని నిపుణులు సూచించారు.
KBC లక్కీ డ్రాలో 25 లక్షలు గెలుచుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టులు నకిలీ అని తేల్చేశారు.