సోషల్ మీడియా వినియోగదారులు భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. కోహ్లీ అందులో భారత్ జోడో యాత్ర లోగోతో కూడిన టీ-షర్ట్ ధరించి ఉన్న ఫోటోను షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు కోహ్లీ మద్దతు తెలిపారని వినియోగదారులు పేర్కొన్నారు.
ఒక ట్విట్టర్ యూజర్ ఫోటోను షేర్ చేస్తూ, "ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచాడు..." అని రాసుకొచ్చాడు.
పలువురు ట్విట్టర్, ఫేస్ బుక్ యూజర్లు కూడా ఇదే దావాతో పోస్టులను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
NewMeter బృందం వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. "టాప్ 10 విరాట్ కోహ్లీ ఫ్యాషన్ ఫోటోలు" అనే శీర్షికతో Stylerug ద్వారా ఏర్పాటు చేసిన ఒక కథనంలో అదే ఫోటో కనుగొనబడింది. ఈ కథనంలోని అదే ఫోటోలో కోహ్లీ టీషర్ట్‌పై భారత్ జోడో యాత్రకు సంబంధించిన లోగో లేదు.
Pinkvilla వెబ్సైట్, 24 సెప్టెంబర్ 2016న ప్రచురించిన ఒక కథనంలో కూడా ఈ ఫోటోను ఉపయోగించింది. ఏస్ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి కి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ హెడ్‌షాట్ ఫోటోను పంచుకున్నారు.
మేము రోహన్ శ్రేష్ఠ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విరాట్ కోహ్లీ ఫోటో కోసం వెతికాము. ఆ ఫోటోను 23 సెప్టెంబర్ 2016న పోస్ట్ చేశారు. అయితే, కోహ్లీ టీ-షర్ట్‌పై భారత్ జోడో యాత్ర లోగో మాకు కనిపించలేదు. అప్పటికి భారత్ జోడో యాత్ర అంటూ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టలేదనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి.
విరాట్ కోహ్లి భారత్ జోడో యాత్రకు మద్దతు ఇచ్చారా అనే విషయమై కూడా మేము వార్తా నివేదికల కోసం వెతికాము, కానీ అలాంటి నివేదిక ఏదీ కనుగొనలేదు.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు విరాట్ కోహ్లీ మద్దతు ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేశారు. కాబట్టి, వైరల్ అవుతున్న దావాలో ఎటువంటి నిజం లేదు.