Factcheck : 50 సంవత్సరాల పైబడిన వాళ్లను రిటైర్ అవ్వమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరిందా..?

No UP Government is Not Forcing Employees Aged 50 Years and above to retire. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Sep 2021 4:35 AM GMT
Factcheck : 50 సంవత్సరాల పైబడిన వాళ్లను రిటైర్ అవ్వమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరిందా..?

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం 50 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులందరినీ పదవీ విరమణ చేయమని కోరుతోందనే పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఈ మార్గదర్శకాలు అన్ని విభాగాలకు జారీ చేయబడ్డాయి అంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్న ఫోటోను ఉంచి పలువురు పోస్టులు చేయడం మొదలుపెట్టారు.

https://www.facebook.com/groups/165845004014785/permalink/1025598118039465/

https://www.facebook.com/groups/165845004014785/permalink/1025597104706233/

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా ఉన్నాయి.

Awadhbhoomi news అనే ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ పోస్టు వచ్చినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది. దాని తర్వాతనే పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవధూమి న్యూస్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసిన వార్తా నివేదికలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 50 ఏళ్లు దాటిన ఉద్యోగులను రిటైర్ అవ్వమని కోరినట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ 8న ఆర్టికల్ ను కూడా తమ వెబ్ సైట్ లో ఉంచింది. కీవర్డ్ సెర్చ్ చేయగా Dainik Jagran లో కూడా కథనాలు వచ్చాయి. కళంకిత, అవినీతి పోలీసులను రిట్రెంచ్ చేసే ప్రక్రియకు సంబంధించిన ఆర్డర్ ఇది మీడియా సంస్థలు తెలిపాయి.

"యుపి పోలీస్: యుపిలో కళంకిత, అవినీతి పోలీసుల రిట్రెంచ్‌మెంట్, స్క్రీనింగ్ ప్రారంభించడానికి ఆదేశం" అనే నివేదిక ప్రకారం, అన్ని జిల్లాల్లో తిరస్కరించబడిన పోలీసుల స్క్రీనింగ్ నిర్వహించాలని డిజిపి ప్రధాన కార్యాలయాన్ని ఆదేశించారు. నిర్బంధ పదవీ విరమణ కోసం 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కళంకిత పోలీసులను పరీక్షించడం ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. యోగి ప్రభుత్వం యొక్క జీరో టాలరెన్స్ విధానం కింద, కళంకిత పోలీసులను బయటకు పంపించాలని భావిస్తోంది. ఇంతకు ముందు ముగ్గురు ఐపిఎస్ అధికారులకు కూడా తప్పనిసరిగా రిటైర్‌మెంట్ ఇవ్వబడింది. స్క్రీనింగ్ వివరాలను నవంబర్ 30 లోపు డీజీపీ ప్రధాన కార్యాలయానికి పంపాలని నివేదిక పేర్కొంది.

సెప్టెంబర్ 9 న నవభారత్ టైమ్స్ ప్రచురించిన ఇలాంటి నివేదికను మేము కనుగొన్నాము. 50 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కళంకిత పోలీసులను బలవంతంగా పదవీ విరమణ చేసే ప్రక్రియను యుపి పోలీసు శాఖ మరోసారి ప్రారంభించిందని ఇది పేర్కొంది. డిజిపి ప్రధాన కార్యాలయం నాలుగు కమిషనరేట్‌లతో సహా అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ పోలీసులను మరియు యూనిట్ల ఇన్‌ఛార్జిలను అటువంటి పోలీసుల జాబితాను సిద్ధం చేసి, నవంబర్ 30 లోపు ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించింది.

సెప్టెంబర్ 8 న ప్రచురించబడిన ABP న్యూస్ వీడియో నివేదిక ప్రకారం, 50 ఏళ్లు పైబడిన అవినీతి మరియు కళంకిత పోలీసు అధికారులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.

వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని స్పష్టమవుతోంది. 50 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కళంకిత పోలీసులను తప్పనిసరిగా పదవీ విరమణ కోసం పరీక్షించాలని మాత్రమే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన వాళ్ల విషయంలో కాదు.


Claim Review:50 సంవత్సరాల పైబడిన వాళ్లను రిటైర్ అవ్వమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోరిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story