తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 29 నుండి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారని.. సొంతూళ్లకు వెళ్లిపోండి అంటూ ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


"ఇప్పుడే అందిన వార్త.. సొంతూళ్లకు వెళ్లిపోండి.. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 తేదీన మళ్ళీ లాక్ డౌన్" అంటూ అందులో ఉంది. దీన్ని చూసిన ప్రజలు నిజంగా లాక్ డౌన్ ను అమలు చేయబోతూ ఉన్నారేమోనని భయపడి పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. లాక్ డౌన్ ను ఏప్రిల్ 29 నుండి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటీవలి కాలంలో చెప్పలేదు. అధికారిక స్టేట్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం నుండి రాలేదు.

న్యూస్ మీటర్ తెలంగాణలో లాక్ డౌన్ గురించిన వార్తల కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేయగా ఎటువంటి వార్తలు కూడా రాలేదు. తెలంగాణ ప్రభుత్వం కేవలం నైట్ కర్ఫ్యూను మాత్రమే అమలు చేస్తూ ఉంది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది.

అన్ని ఆఫీసులు, కంపెనీలు, షాపులు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలలోపు మూసి వేయాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ ల్యాబ్స్, ఫార్మసీలు, ఎసెన్షియల్ సర్వీసులకు మాత్రమే సడలింపును ఇచ్చారు. ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్ కాస్టింగ్, ఎల్. పి.జి., సి.ఎన్.జి., గ్యాస్ అవుట్ లెట్స్ వంటి వాటికి సడలింపులు ఇచ్చారు.

https://covid19.telangana.gov.in/wp-content/uploads/2021/04/GO-87-Imposition-of-Night-Curfew-in-Telangana.pdf

https://covid19.telangana.gov.in/lockdown-faqs/

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వెబ్ పోర్టల్ ను గమనించగా అందులో ఎక్కడ కూడా కొత్తగా లాక్ డౌన్ కు సంబంధించిన ప్రెస్ రిలీజ్ ను ఇవ్వలేదు.


ప్రజల ఇబ్బందులను గమనించామని.. లాక్ డౌన్ అన్నది ఉండదని కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు.

https://newsmeter.in/top-stories/no-lockdown-in-telangana-public-are-advise-to-follow-covid-norms-kcr-676021

తెలంగాణలో ఏప్రిల్ 29 నుండి లాక్ డౌన్ అంటూ వైరల్ అవుతున్న పోస్టర్ లో ఎటువంటి నిజం లేదు.


Claim Review :   తెలంగాణలో ఏప్రిల్ 29 నుండి లాక్ డౌన్ అంటూ వైరల్ అవుతున్న పోస్టర్..!
Claimed By :  Social Media Post
Fact Check :  False

సామ్రాట్

Next Story