FactCheck : టాప్ టెన్ ధనిక మంత్రుల జాబితాలో కేటీఆర్ లేరు
No, Telangana Min KTR’s Name Is Not Included In Top Ten Rich Ministers List. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న మంత్రుల్
By Nellutla Kavitha Published on 4 Feb 2023 4:34 PM ISTదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న మంత్రుల్లో, టాప్ టెన్ అత్యధిక ధనవంతులైన జాబితాలో కేటీఆర్, జగన్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ గా సర్క్యులేట్ అవుతోంది. ఈ న్యూస్ క్లిప్ ని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు కొంతమంది నెటిజెన్స్.
ఇక ఇదే న్యూస్ క్లిప్ ని తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా పోస్ట్ చేసింది.
అటుకులు తిని బతికినం అన్నోళ్లు
— Telangana Congress (@INCTelangana) February 2, 2023
అపర కుబేరులుగా అయ్యారెట్లా?
డొక్కు సైకిల్ పై తిరిగినోళ్లు ....టాప్ -10 ధనవంతులుగా ఎట్ల మారిండ్రు?
వేల, లక్షల కోట్లు సంపాదించే ఆ కిటుకేదో
ప్రజలకూ చెప్పొచ్చుగా..? @KTRBRS pic.twitter.com/2DbD2USZfG
ఫేస్ బుక్ లో కూడా ఈ వైరల్ న్యూస్ క్లిప్ ని చూడవచ్చు.
నిజ నిర్ధారణ :
నిజంగానే వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్ లో చెప్పినట్టుగా దేశంలో ఉన్న మంత్రుల్లో, టాప్ టెన్ అత్యధిక ధనవంతుల జాబితాలో కేటీఆర్ ఉన్నారా?! ఫ్యాక్ట్ చెక్ చేసి చూసింది న్యూస్ మీటర్ టీం. ఇందుకోసం గూగుల్ కీవర్డ్ సెర్చ్, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్ ను ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించినట్టుగా తెలిసింది. ఫిబ్రవరి 2, 23న ప్రచురించిన వార్తా కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన నివేదికలో ఈ రిపోర్ట్ చూడవచ్చు అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది. దీంతో ఏడిఆర్ ప్రచురించిన నివేదిక కోసం గూగుల్ సెర్చ్ చేసింది న్యూస్ మీటర్ టీం. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మంత్రి మండలికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ వెబ్సైట్ లో ఉంచింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. నాయకులు ఎన్నికల సమయంలో సమర్పించే అఫిడవిట్ ఆధారంగా ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి వయసు, విద్యార్హతలు, క్రిమినల్ రికార్డులు, ఆస్తులు, అప్పుల వివరాలను ఏడిఆర్ నివేదికలో అందించింది. అయితే వైరల్ అయిన న్యూస్ క్లిప్ తో పాటుగా సోషల్ మీడియా పోస్టుల్లో చెప్పినట్టుగా కేటీఆర్ టాప్ టెన్ ధనవంతుల మంత్రుల జాబితాలో లేరు. ఆంధ్రప్రదేశ్ నుంచి రెండవ స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, 9వ స్థానంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పదవ స్థానంలో మంత్రి విడదల రజిని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ లిస్టు లో ముగ్గురు ఉంటే తెలంగాణ నుంచి ఒక్కరు కూడా లేరు. ఈ లిస్టు 11వ పేజీలో చూడవచ్చు.
అయితే ఈ వార్తని పబ్లిష్ చేసిన ఆంధ్రజ్యోతి కూడా, పొరపాటుగా కేటీఆర్ పేరు ధనవంతులైన మంత్రుల జాబితాలో ఉన్నట్టుగా వార్త ప్రచురించామని, మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 3, 2023న సవరణను ప్రచురించింది. కేటీఆర్ పేరు లేదు అంటూ విడుదలైన క్లిప్ ఇక్కడ చూడవచ్చు.
https://epaper.andhrajyothy.com/Home/FullPage?eid=34&edate=03/02/2023&pgid=352291
ఇక ఆసక్తికరంగా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తన వెబ్సైట్లో అందించిన నివేదికలో, తెలంగాణ మంత్రి కేటీఆర్ అత్యధిక అప్పులు కలిగిన జాబితాలో ఉన్నారు. 41 కోట్ల ఆస్తుల విలువ ఉన్న కేటీఆర్ కు 27 కోట్ల అప్పులు ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. ఏడిఆర్ వెల్లడించిన టాప్ టెన్ అప్పులు కలిగిన మంత్రులు జాబితాలో కేటీఆర్ ది ఆరవ స్థానం.
సో న్యూస్ క్లిప్ ఆధారంగా వైరల్ గా సర్క్యులేట్ అవుతున్నట్టుగా టాప్ టెన్ ధనవంతులైన మంత్రుల జాబితాలో కేటీఆర్ లేరు. ఏడిఆర్ వెల్లడించిన నివేదికలో కేటీఆర్ అత్యధిక అప్పులు కలిగిన టాప్ టెన్ జాబితాలో ఉన్నారు.