ఐకానిక్ పెన్ బ్రాండ్ రేనాల్డ్స్ భారత మార్కెట్ నుండి వైదొలుగుతున్నట్లు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
ఆగస్ట్ 23న, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ “గుడ్‌బై, రేనాల్డ్స్ అందరి చిన్ననాటి స్నేహితుడు” అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. కథనంలో, ఐకానిక్ రేనాల్డ్స్ పెన్ కొన్ని బ్యాచ్‌లు మాత్రమే అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రేనాల్డ్ పెన్నులు ఇకపై మార్కెట్‌లో అందుబాటులో ఉండవని, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయిందని తెలిపారు.
ఒక X వినియోగదారు రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ చిత్రాన్ని పంచుకున్నారు. పెన్ మార్కెట్లో ఇకపై అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. పలువురు X వినియోగదారులు కూడా అదే వాదనతో క్లెయిమ్ చేసారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేది. ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని పేర్కొంటూ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసిందని NewsMeter కనుగొంది. రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ పెన్నుల నిలిపివేతకు సంబంధించి మేము ఎటువంటి ప్రకటనను కనుగొనలేకపోయాము.
మేము రేనాల్డ్స్ వెబ్‌సైట్‌ని తనిఖీ చేసాము. కస్టమర్‌లు, భాగస్వాములు, వాటాదారులను ఉద్దేశించి ఒక సందేశాన్ని చూశాము. రేనాల్డ్స్ గురించి వివిధ మాధ్యమాలలో ఇటీవల తప్పుడు సమాచారం వైరల్ అవుతూ ఉందని. ఇది తప్పుదోవ పట్టించేదని.. వాటిని నమ్మకండి అని వెబ్ సైట్ లో స్పష్టం చేశారు. తాము భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా పేర్కొంది.
కంపెనీ అధికారిక Facebook, Instagram ఖాతాలలో కూడా మేము అదే వివరణతో ఉన్న పోస్ట్ ను చేసాము. వైరల్ సమాచారం తప్పు అని క్యాప్షన్‌లో సంస్థ పేర్కొంది. ఏదైనా అప్‌డేట్‌ల కోసం కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా ఛానెల్‌లను చూడాలని కంపెనీ తన భాగస్వాములు, వాటాదారులు, కస్టమర్‌లకు సూచించింది.
మేము కంపెనీ వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలలో రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బర్ పెన్‌లకు సంబంధించిన ప్రకటన కోసం వెతికాము. కానీ ఏదీ కనుగొనలేకపోయాము. NewsMeter బృందం ఐకానిక్ కేటగిరీ అయిన Reynolds 045 Fine Carbureని నిలిపివేయబోతున్నారా అని ప్రత్యేకంగా అడుగుతూ కంపెనీకి మెయిల్ పంపింది. వారు ప్రతిస్పందించినప్పుడు ఈ ఆర్టికల్ ను అప్డేట్ చేశాం.
భారతీయ మార్కెట్‌ను విడిచిపెట్టడం లేదా రేనాల్డ్స్ 045 ఫైన్ కార్బ్యూర్ పెన్ ను నిలిపివేయడం గురించి రేనాల్డ్స్ నుండి మాకు ఎటువంటి ప్రకటన కనిపించలేదు. వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam