ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి చెందిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య.. గాజాలో బాంబు దాడికి నిరసనగా ప్రపంచానికి గ్యాస్ సరఫరాను నిలిపివేస్తానని బెదిరిస్తున్నట్లు పోస్టులు పెట్టారు.
వీడియో కింద ట్వీట్ లో “‘గాజాపై బాంబు దాడి ఆగకపోతే, మేము ప్రపంచానికి గ్యాస్ సరఫరాను నిలిపివేస్తాము. ఖతార్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్న జర్మనీకి పెద్ద దెబ్బ. (sic)” అంటూ పోస్టు పెట్టారు.
US ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఖతార్ సహజ వాయువుకు సంబంధించి మూడవ-అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఐరోపాకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ వైరల్ వాదనలో ఎటువంటి నిజం లేదని కనుగొంది.
ఖతార్ ఎమిర్ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ప్రకటనపై మీడియా నివేదికలను కనుగొనడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. కానీ ఏదీ కనుగొనలేకపోయాము. అల్ థానీ లేదా ఏదైనా ఖతార్ ప్రభుత్వ అధికారి గ్యాస్ సరఫరాను నిలిపివేస్తామని బెదిరించినట్లు ప్రకటనలు వచ్చి ఉంటే ఏవైనా విశ్వసనీయ వార్తా సంస్థలకు సంబంధించిన నివేదికలు కనిపించి ఉండేవి. ఈ వార్తలు నిజమైతే, ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు తప్పకుండా నివేదించి ఉండేవి.
వీడియో కీఫ్రేమ్‌లకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అక్టోబర్ 13, 2023న C-Span ద్వారా ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. పూర్తి వీడియోలో, US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, అల్ థానీ సంభాషణ చూడవచ్చు. ఖతార్, విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది.
మొత్తం వీడియోను విశ్లేషించగా.. గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రస్తావన ఏదీ కనుగొనలేదు.
వైరల్ క్లెయిమ్ ఫేక్ అని చెబుతూ అక్టోబర్ 12, 2023న దోహా న్యూస్ ప్రచురించిన నివేదికను కూడా మేము కనుగొన్నాము.
మేము మే 14, 2017న అల్ జజీరా ముబాషిర్ YouTube ఛానెల్‌లో వీడియో అసలైన విజువల్స్ ను కనుగొన్నాము. దోహా ఫోరమ్‌లో అల్ థానీ చేసిన ప్రసంగాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు సంబంధించి తన అభిప్రాయాలను చెప్పాడు కానీ.. ప్రపంచానికి గ్యాస్ సరఫరాను నిలిపివేయడం గురించి ప్రస్తావించలేదు.
కాబట్టి, వైరల్ అవుతున్న క్లిప్ పాతది. ఇజ్రాయెల్-హమాస్ వివాదంపై ఖతార్ వైఖరి గురించి తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
Credits : Sunanda Naik