FactCheck : ఐపీఎల్ లో బెస్ట్ ఆల్ రౌండర్ కు 'మిక్స్డ్ క్యాప్' ఇవ్వనున్నారా..?
No Mixed Cap for best all rounder in IPL Viral Claims are False. ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ కొత్త 'మిక్స్‌డ్ క్యాప్'ను ప్రకటించిందని పేర్కొంటూ
ఐపీఎల్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్ కోసం బీసీసీఐ కొత్త 'మిక్స్‌డ్ క్యాప్'ను ప్రకటించిందని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్యాప్ సగం నారింజ- సగం ఊదా రంగులో ఉంటుందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఐపీఎల్ లో ఇప్పటికే ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే..! సీజన్ లో ఎక్కువ పరుగులు కొట్టే ఆటగాళ్లకు ఆరెంజ్ క్యాప్ ను ఇస్తూ ఉండగా.. అత్యధిక వికెట్లను తీసే బౌలర్లకు పర్పుల్ క్యాప్ ను ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్ రౌండర్లకు ఈ రెండు రంగుల మిశ్రమంతో కూడా క్యాప్ ను ఇస్తారనే ప్రచారం సాగుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
NewsMeter ఈ ప్రకటనపై వార్తా నివేదికల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసింది.. కానీ వైరల్ పోస్టుకు మద్దతు ఇచ్చే ఏ వార్త కూడా కనుగొనబడలేదు. ఫ్యాక్ట్ చెక్ బృందం BCCI, IPL రెండింటి అధికారిక వెబ్‌సైట్‌లలో వార్తలు, ప్రకటనల విభాగాలను కూడా శోధించింది, అయితే అలాంటి ప్రకటన ఏదీ చేయబడలేదు. IPL సీజన్ లకు సంబంధించిన అప్డేట్స్ మినహా.. మిక్స్‌డ్ క్యాప్‌పై ఎలాంటి ప్రకటనలు కూడా పోస్ట్ చేయబడలేదు.
నిజంగానే బోర్డు కొత్త టోపీని నిర్ణయించి ఉంటే ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించే వారు. టోర్నమెంట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ను గౌరవించేందుకు BCCI మూడవ "మిక్స్‌డ్ క్యాప్"ను ప్రకటించింది అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
Claim Review:ఐపీఎల్ లో బెస్ట్ ఆల్ రౌండర్ కు 'మిక్స్డ్ క్యాప్' ఇవ్వనున్నారా..?