నది ఒడ్డున ఉన్న వంతెన దగ్గర మత్స్యకన్య కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలోని నల్గొండలోని మూసీ నదికి సమీపంలోని దామరచర్ల వద్ద ఇటీవల మత్స్యకన్య కనిపించిందని ప్రచారం జరుగుతోంది.
వైరల్ క్లెయిమ్‌పై నిజ నిర్ధారణ చేయాలని NewsMeter ట్విట్టర్‌లో అభ్యర్థనను అందుకుంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించింది. అనేక మంది Facebook వినియోగదారులు వివిధ సందర్భాలతో వీడియోను షేర్ చేసినట్లు కనుగొన్నాము.
కీవర్డ్ సెర్చ్ ద్వారా 'JJPD ప్రొడక్షన్స్' అనే YouTube ఛానెల్‌కు చేరుకున్నాము. అందులో వైరల్ అవుతున్న వీడియో.. మంచి క్లారిటీతో కనిపించింది. "ఇవి వినోదం కోసం మేము సృష్టించిన పారానార్మల్ వీడియోలు. చూపిన చిత్రాలన్నీ కల్పితం. CGI వీడియో (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్) తో రూపకల్పన చేశాం. 3Dలో సృష్టించాం" అని వివరణ ఇచ్చారు. వీడియోలో నిజమైన మత్స్యకన్యను చూపించలేదని ఇది రుజువు చేస్తుంది.
మత్స్యకన్యల ఉనికి ఇప్పటికీ ఒక రహస్యం. "మత్స్యకన్యలు నిజమేనా?" అనే శీర్షికతో US నేషనల్ ఓషన్ సర్వీస్ వెబ్‌సైట్‌లో కథనం కనుగొనబడింది, "అక్వాటిక్ హ్యూమనాయిడ్స్‌కు సంబంధించిన ఆధారాలు ఏవీ కనుగొనబడలేదు." అని అందులో ఉంది. "No evidence of aquatic humanoids has ever been found. Why, then, do they occupy the collective unconscious of nearly all seafaring peoples? That's a question best left to historians, philosophers, and anthropologists." అంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణలోని నల్గొండలోని మూసీ నదికి సమీపంలోని దామరచర్ల వద్ద మత్స్యకన్య కనిపించిందన్న వాదన తప్పు. మత్స్యకన్యకు సంబంధించిన సీజీఐ వీడియో షేర్ అవుతోంది. వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.