Fact Check : తిరునెల్వేలి జిల్లాలో ఫ్యాక్టరీల వద్ద సింహం..?

No Lion Spotted in Tirunelveli District Viral Video is Old. ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంగణంలో సింహం నడుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Jun 2021 8:53 PM IST
Fact Check : తిరునెల్వేలి జిల్లాలో ఫ్యాక్టరీల వద్ద సింహం..?

ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంగణంలో సింహం నడుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని సిమెంట్ కర్మాగారంలో సింహం కనిపించిందని సోషల్ మీడియా వినియోగదారులు చెప్పుకొచ్చారు. తమిళనాడులోని వరుధునగర్ జిల్లా ఆర్‌ఆర్ నగర్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో సింహం కనిపించిందని కొందరు సోషల్ మీడియా లో పోస్టులు పెట్టారు. యూట్యూబ్‌తో సహా చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.


'వాడి' సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో సింహం కనిపించిందంటూ మరి కొందరి వీడియోలను పోస్టు చేశారు.

Archive links:

https://web.archive.org/save/https://www.facebook.com/Muthuprakash1592/videos/2893369984210049

https://web.archive.org/save/https://www.facebook.com/permalink.php?story_fbid=1450565305308573&id=100010653518637

https://web.archive.org/save/https://www.facebook.com/100002739818733/videos/3504759919625301

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

తిరునెల్వేలి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అర్జున్ శరవణన్ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తమిళంలో ట్వీట్ చేశారు. "పుకార్లు వ్యాప్తి చేయవద్దు. గత రెండు రోజులుగా తిరునెల్వేలి సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో సింహం తిరుగుతోందని పుకారు ఉంది. ఇది గుజరాత్ స్టేట్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందినది ఈ వీడియో. నెల్లైలో ఉన్న సింహం `తురైసింగ్ ' మాత్రమే కాబట్టి ప్రజలు ప్రశాంతంగా ఉండండి" అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఆ వీడియో తమిళనాడుకు సంబంధించింది కాదని స్పష్టంగా తెలుస్తోంది.


పోర్బందర్ బిర్లా ఫ్యాక్టరీ సమీపంలో సింహాన్ని చూశామన్న వాదనలకు సంబంధించి గుజరాతీలో వార్తా కథనాలను కూడా మేము కనుగొన్నాము.

పోర్బందర్‌లోని వివిధ వాట్సాప్ గ్రూపుల్లో 19 సెకన్ల వీడియో వైరల్ అయ్యిందని, ఇందులో కర్మాగారంలో సింహం తిరుగుతున్నట్లు తెలిసిందని 'ఆజ్‌కా డైలీ' ఒక కథనాన్ని పేర్కొంది. 'సింహం బిర్లా ఫ్యాక్టరీకి వచ్చింది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, షేర్ చేయండి' అనే ఒక టెక్స్ట్‌తో వాట్సాప్‌లో ఎవరో ప్రచారం చేశారు.

అటవీ శాఖ ఈ వీడియోను నకిలీదని ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టించవద్దని విజ్ఞప్తి చేసింది. వాడిలో సింహం ఉందన్న వాదనలను ఖండిస్తూ Gohash.in యూట్యూబ్‌లో ఒక వీడియోను కూడా కనుగొన్నాము.


వీడియోను ఖచ్చితంగా ఎక్కడ తీశారు అనే విషయాన్ని మేము అంచనా వేయలేక పోయినప్పటికీ, గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఉన్న సిమెంట్ కర్మాగారంలో 2020 లో సింహం కనిపించింది అనే వార్తలు వచ్చాయి. కోవయాలోని అల్ట్రాటెక్ గుజరాత్ సిమెంట్ కంపెనీ దగ్గర గేటెడ్ కాలనీలో ఒక మగ సింహం కనిపించింది.

https://timesofindia.indiatimes.com/city/rajkot/lion-out-on-late-night-stroll-near-a-colony-in-rajula-caught-on-camera/articleshow/76363557.cms

https://www.republicworld.com/entertainment-news/whats-viral/scary-lion-spotted-near-cement-factory-in-gujarat-netizens-amused.html

తమిళనాడులో ఫ్యాక్టరీ దగ్గర సింహం కనిపించిందంటూ వచ్చిన వార్తలను మీడియా సంస్థలు కూడా ఖండించాయి.

https://en.youturn.in/factcheck/tirunelveli-virudhunagar-lion-rumors.html

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని సిమెంట్ కర్మాగారంలో సింహం కనిపించిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review:తిరునెల్వేలి జిల్లాలో ఫ్యాక్టరీల వద్ద సింహం..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter
Claim Fact Check:False
Next Story