యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఒక యువతిని ముద్దుపెట్టుకోవడం.. ఆమెను అనుచితంగా తాకడం వంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లిప్‌ను షేర్ చేస్తున్న వ్యక్తులు జో బిడెన్ తన మనవరాలిని అసభ్యంగా తాకారని పేర్కొన్నారు.
ట్విట్టర్ వినియోగదారు క్లిప్‌ను పంచుకున్నారు. “Joe Biden groped his granddaughter in front of the world. What happens behind closed doors?” అంటూ పోస్టు పెట్టారు. ప్రపంచం ముందే ఇలా అసభ్యంగా తాకితే.. ఇక వేరే చోట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉంటారోనని ఆరోపించారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేశారని.. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా భాగస్వామ్యం చేశారని కనుగొంది.
వీడియో కీఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించారు. మేము 29 అక్టోబర్ 2022 నుండి గెట్టి ఇమేజెస్‌లో ఇలాంటి చిత్రాన్ని కనుగొన్నాము. క్యాప్షన్ ప్రకారం, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ మనవరాలు నటాలీ బిడెన్ తొలిసారి ఓటు వేశారు. "ఓటెడ్” స్టిక్కర్‌ను ఉంచినట్లు ఫోటోలో ఉంది. 29 అక్టోబర్ 2022న విల్మింగ్టన్, డెలావేర్‌లో ముందస్తుగా ఓటు వేసింది. నటాలీ బిడెన్ జో బిడెన్ దివంగత కుమారుడు బ్యూ బిడెన్ కుమార్తె అని.. ఆమె మొదటిసారి ఓటు వేసినట్లు కూడా పేర్కొంది.
దీనిని క్యూగా తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. NBC న్యూస్‌లో వీడియోను కనుగొన్నాము. ప్రెసిడెంట్ బిడెన్, ఆయన మనవరాలు కలిసి వారి ఓట్లు వేశారని తెలిపింది.
బిడెన్ తన మనవరాలు మొదటిసారి ఓటు వేస్తున్నట్లు ఓటింగ్ గదిలోని ఉద్యోగులకు, ప్రజలకు తెలియజేశారు. ఇతర ఫ్రేమ్‌లలో, నటాలీ బిడెన్ తన తాతపై వోటెడ్ అనే ఒక స్టిక్కర్‌ను ఉంచింది. దాని తర్వాత బిడెన్ నటాలీ బిడెన్‌పై స్టిక్కర్‌ను ఉంచారు.
వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు షేర్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, జో బిడెన్ తన మనవరాలిని అసభ్యంగా పట్టుకున్నారనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.
Claim Review:అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ యువతిని అసభ్యంగా తాకారా..?