FactCheck : అహ్మదాబాద్ పేరును కర్ణావతి అనే పేరుగా మార్చారా..?
No Ahmedabad Has not been Renamed Karnavati. అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చినట్లు సోషల్ మీడియా వినియోగదారులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2021 3:03 PM IST*BIG Breaking News:- आज और अभी से #अहमदाबाद का नाम #कर्णावती कर दिया गया है। बधाई रुकनी नही चाहिए साथियों* అంటూ హిందీలో ఉన్న పోస్టును అప్లోడ్ చేస్తున్నారు.
BIG Breaking News:- आज और अभी से #अहमदाबाद का नाम #कर्णावती कर दिया गया है। बधाई रुकनी नही चाहिए साथियों 🚩🚩🙏 https://t.co/uUrtGRxLGo#ModiJiWeWantKarnavati
— @नवीन राजपूत 🅱🅹🅿 #प्रशासक_समिति (@NaveenHindu16) October 17, 2021
*BIG Breaking News:- आज और अभी से #अहमदाबाद का नाम #कर्णावती कर दिया गया है। बधाई रुकनी नही चाहिए साथियों* 🚩🚩🙏 pic.twitter.com/UyQf6w2X6X
— Digvijay Singh Thakur (@digvijay12a) October 15, 2021
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ కీవర్డ్ సెర్చ్ చేయగా.. పేరు మార్చినట్లుగా ఎటువంటి వార్త కూడా కనిపించలేదు. అహ్మదాబాద్ ని కర్ణావతిగా పేరు మార్చడం గురించి మీడియా ఛానల్స్ లో ఎటువంటి నివేదికలను కనుగొనలేదు. అహ్మదాబాద్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాము. జిల్లాకు ఇప్పటికీ అహ్మదాబాద్ అనే పేరే ఉంది.
DNA మీడియాలో 11 ఏప్రిల్ 2019న ఓ వార్త ఉంది. అందులో అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చాలనే ప్రపోజల్ గురించి చెప్పుకొచ్చారు. "Gujarat High Court, for the time being, has rested the controversy over the proposed change of the city's name from Ahmedabad to Karnavati and disposed of public interest litigation (PIL) seeking the court's intervention in restraining the government from doing so." అంటూ కథనాన్ని ప్రచురించారు.
గుజరాత్ హైకోర్టు అహ్మదాబాద్ నగరం పేరును కర్ణావతిగా మార్చాలనే ప్రతిపాదనపై వివాదానికి సంబంధించిన వార్త ఉంది. ప్రభుత్వం అలా పేరు మార్చకుండా నిరోధించడంలో కోర్టు జోక్యాన్ని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) పరిష్కరించింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో నవంబర్ 7, 2018న "Now, Gujarat govt keen on renaming Ahmedabad as Karnavati" అనే కథనాన్ని ఉంచింది. "Taking a cue from Uttar Pradesh, the Gujarat government has now expressed its interest in renaming Ahmedabad as Karnavati. The government Tuesday said it's keen on rechristening Ahmedabad as Karnavati if there are no legal hurdles. The development comes after the Yogi Adityanath-led BJP government renamed Allahabad and Faizabad as Prayagaraj and Ayodhya, respectively." అంటూ కథనాన్ని ప్రచురించారు. ఉత్తరప్రదేశ్ లాగా గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చడానికి తన ఆసక్తిని వ్యక్తం చేసింది. న్యాయపరమైన అడ్డంకులు లేకుంటే అహ్మదాబాద్‌ను కర్ణవతిగా మార్చాలని ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అలహాబాద్, ఫైజాబాద్‌లను ప్రయాగరాజ్ మరియు అయోధ్యగా మార్చిన సంగతి తెలిసిందే..!
కాబట్టి అహ్మదాబాద్ పేరును కర్ణావతిగా మార్చిన దాఖలాలు ఎక్కడా లేవు. వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదు.