FactCheck : జోగులాంబ గుడిని మసీదులా మారుస్తున్నారా..?

Muslims are not converting Telanganas Jogulamba into mosque viral claims are false. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ దేవాలయాన్ని మసీదులా మారుస్తున్నారంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 May 2022 8:30 PM IST
FactCheck : జోగులాంబ గుడిని మసీదులా మారుస్తున్నారా..?

తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ దేవాలయాన్ని మసీదులా మారుస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలోని జోగులాంబ ఆలయాన్ని ముస్లింలు మసీదుగా మారుస్తున్నారని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. జోగులాంబ శక్తిపీఠాన్ని దర్గాగా మార్చే ప్రక్రియలో ఉన్నట్లు వినియోగదారులు తెలిపారు.





నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

NewsMeter రివర్స్ సెర్చ్ నిర్వహించి, అదే వీడియోను షేర్ చేసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన ట్వీట్‌ను కనుగొంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని ఓ ఆలయం గురించి ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హిందూ దేవాలయాల ప్రాంగణంలోని దర్గా, మసీదు వంటి అక్రమ ఆక్రమణలను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

"ప్రాచీన జోగుళాంబ శక్తి పీఠం ప్రాంగణంలోని హిందూయేతర మతపరమైన కట్టడాలను తొలగించాలని భారత పురావస్తు శాఖకు రాసిన లేఖలో ఆయన కోరారు. చాలా కాలం క్రితం ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా దర్గా కనిపించిందని, రాత్రికి రాత్రే కమాన్‌ని నిర్మించారని తెలిపారు. గుడి ప్రాంగణంలోకి చొరబడినా ప్రభుత్వ శాఖలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. " అన్నారు.

తెలంగాణ జోగులాంబ ఆలయాన్ని ముస్లింలు మసీదుగా మార్చారని ప్రధాన స్రవంతి మీడియా నుండి మాకు ఇటీవలి కాలంలో ఎలాంటి నివేదిక కనిపించలేదు.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్‌లో వెతికితే తెలంగాణలోని అలంపూర్ వివరాలు దొరికాయి. అలంపూర్ సంగమేశ్వర దేవాలయం, పాపనాసి దేవాలయం, నవబ్రహ్మ దేవాలయాల సమూహం. అనేక పురాతన దేవాలయాలతో కూడిన ఆలయ పట్టణం. అలంపూర్‌లో 17వ శతాబ్దానికి చెందిన దర్గాను షా అలీ దర్గా అని పిలుస్తారు.

https://www.asihyderabadcircle.com/menu?menuid=19&&l=1

షా అలీ దర్గా 15వ- 17వ శతాబ్దాల మధ్య అలంపూర్‌లో నవబ్రహ్మ ఆలయాలలో నిర్మించబడింది. హిందూ దేవాలయాలు ఏడవ, తొమ్మిదవ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి. "ఈ దేవాలయాలు, దర్గాలు 1926-1927లో ముస్లిం పురావస్తు శాస్త్రవేత్త గులాం యజ్దానీచే హైదరాబాద్ నిజాం కోసం సర్వే చేయబడ్డాయి. 1929లో పురావస్తు శాఖ యొక్క వార్షిక నివేదికగా ప్రచురించబడ్డాయి" అని యజ్దానీ తెలిపారు.

https://heritage.telangana.gov.in/monuments/muslim-fort-and-shah-alis-dargah/

https://archive.org/stream/in.ernet.dli.2015.73287/2015.73287.Annual-Report-Of-The-Archaeological-Department-1926-1927_djvu.txt

మేము Google మ్యాప్‌లను తనిఖీ చేసాము. ఇటీవల నిర్మించిన దర్గా ఇటీవలి చిత్రాలను కనుగొన్నాము. జోగులాంబ ఆలయ సముదాయం పార్కింగ్ ఏరియా దగ్గర బ్యాక్‌గ్రౌండ్‌లో దర్గాను ఈ యూట్యూబ్ వీడియోలో కూడా చూడవచ్చు.

https://maps.app.goo.gl/RVskEaHKTH1KJEZk9


కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.















































Claim Review:జోగులాంబ గుడిని మసీదులా మారుస్తున్నారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story