ఎంతో మంది ఫేస్ బుక్ యూజర్లు.. మిస్టర్ బీన్ నటుడు రోవన్ అట్కిన్సన్ చనిపోయారంటూ పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మే 29, 2021 నుండి పలువురు ఫేస్ బుక్ లో అట్కిన్సన్ చనిపోయారంటూ కథనాలను షేర్ చేయడం మొదలు పెట్టారు.
"Mr.Bean" అనే ఫేస్ బుక్ పేజీలో మిస్టర్ బీన్ చనిపోయారంటూ పోస్టులను పెట్టారు.
"REST IN PEACE/Rowan Sebastian 'MR.BEAN' Atkinson/Born: 6 January 1955 -- Died: 29 May 2021 (sic)." అంటూ స్టేటస్ పెట్టగా.. 7000 మందికి పైగా షేర్లు చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. రోవన్ అట్కిన్సన్ బ్రతికే ఉన్నారు.
రోవన్ అట్కిన్సన్ ఇంగ్లీష్ నటుడు.. ఆయనకు మిస్టర్ బీన్ అనే క్యారెక్టర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ముఖాల్లో నవ్వులు పూయించిన నటుడు. ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు PBJ మేనేజ్మెంట్ సంస్థ మీడియాకు చెబుతూ ఉంటుంది. ఆయన చనిపోయారంటూ వైరల్ అవుతున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని ఆయన మేనేజ్మెంట్ మీడియాకు తెలిపింది. ఇలాంటి తప్పుడు కథనాలను అసలు నమ్మకండని అన్నారు.
ఇక రోవన్ అట్కిన్సన్ చనిపోయారంటూ వార్తను పోస్టును చేసిన "Mr.Bean" అనే ఫేస్ బుక్ పేజీ.. మిస్టర్ బీన్ షో అధికారిక ఫేస్ బుక్ పేజీ కాదు. "Mr Bean" అన్నది అధికారిక ఫేస్ బుక్ పేజీ. ఆయన మరణ వార్త గురించి ఏ మీడియా సంస్థ కూడా కథనాన్ని ప్రచురించలేదు.
మిస్టర్ బీన్ నటుడు రోవన్ అట్కిన్సన్ మరణించాడనే తప్పుడు వార్తలు 2012 నుండి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఎన్నో మీడియా సంస్థలు ఆయన చనిపోలేదని వార్తలను ప్రచురించారు.
మే 29న రోవన్ అట్కిన్సన్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.