పబ్లిక్ గా ఓ వ్యక్తిని టార్చర్ పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల గుంపు బహిరంగంగా ఒక వ్యక్తిని దారుణంగా హింసిస్తున్నట్లు చూపించే వీడియోను పలువురు సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన వీడియో అంటూ షేర్ చేస్తున్నారు.
"ఈ వీడియో ఎక్కడిదో తెలియదు, కానీ ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్న పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ప్రజలలో చాలా ద్వేషాన్ని నింపింది," అంటూ పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియో షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినది.
న్యూస్‌మీటర్ బృందం ఈ వీడియో షార్ట్ ఫిల్మ్‌లోనిదని.. నిజమైన సంఘటన కాదని గుర్తించింది. కాబట్టి ఆ వాదనలో ఎటువంటి నిజం లేదని గుర్తించింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మేము యూట్యూబ్ ఛానెల్‌లో `విపిన్ పాండే 173'లో షార్ట్‌ని కనుగొన్నాము, ఇందులో ఒక పోలీసు ఒక వ్యక్తిని దారుణంగా కొడుతున్న సీన్ ఉంది. "త్వరలో వీడియో వస్తుంది.. దయచేసి నా YouTube ఛానెల్‌కు మద్దతు ఇవ్వండి" అని ఆ ఛానల్ లో ఉంచారు.
దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము విపిన్ పాండే యూట్యూబ్ ఛానెల్‌ని కనుగొన్నాము. Vipin Pandey entertainment productions అనే ఛానెల్ ఉందని గుర్తించాం.
ఈ యూట్యూబ్ ఛానెల్‌లోని షార్ట్‌ల విభాగంలో పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన మరో 4 వీడియోలు కూడా ఉన్నాయి. 'దోస్తీ కి సజా' అనే షార్ట్ ఫిల్మ్‌లో భాగమని తెలిపారు. 11 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్ ను 15000 మందికి పైగా చూసారు.
షార్ట్ ఫిల్మ్ వివరణ విభాగంలో, షార్ట్ ఫిల్మ్‌లో పని చేసిన వ్యక్తులు గురించి కూడా ఉంది. షార్ట్ ఫిల్మ్ జూన్ 28 న ఢిల్లీలో జరిగిన సాక్షి హత్య కేసు ఆధారంగా రూపొందించారని పేర్కొన్నారు.
వైరల్ వీడియో కేవలం షార్ట్ ఫిల్మ్ నుండి తీసుకుని వైరల్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పోలీసుల క్రూరత్వానికి సంబంధించి నిజంగా జరిగిన ఘటన కాదని స్పష్టంగా తెలుస్తుంది.