జానే మెరీ జానెమన్.. బచ్ పన్ కా ప్యార్.. అంటూ ఓ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఈ పాట పాడిన సహదేవ్ అనే పిల్లాడికి 23 లక్షల రూపాయాల విలువైన మోరిస్ గరాజ్ ఎలెక్ట్రిక్ కారును గిఫ్ట్ గా ఇచ్చారనే ప్రచారం సాగుతూ ఉంది.
ఎంజీ కారు ముందు సహదేవ్ నిలబడుకుని ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉండగా.. అతడికి బహుమానంగా కారు దొరికిందంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
https://www.ptcnews.tv/mg-honours-bachpan-ka-pyar-fame-sahadev-dirdo-gifts-electric-car/
https://www.businesskhabar.com/business/automobile/sahdev-who-sang-baspan-ka-pyaar-got-a-23-lakh-mg-car-as-a-gift-created-a-ruckus-on-the-internet/
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ దీనిపై కీవర్డ్ సెర్చ్ చేసింది, ఇది `నయీ దునియా'లో ప్రచురించబడిన వార్తా నివేదిక చూపించింది. ఆ వార్తా కథనంలో సహదేవ్‌కు ఏ కారును బహుమతిగా ఇవ్వలేదని తెలిపింది.
నివేదిక ప్రకారం, MG కంపెనీ ప్రతినిధి వారు ఏ కారును అతడికి బహుమతిగా ఇవ్వలేదని చెప్పారు. అయితే, వారు సహదేవ్‌కు రూ.21,000 నగదు బహుమతి ఇచ్చారు.
ఇక పంజాబీ గాయకుడు బాద్షా బుధవారం 'బచ్‌పన్ కా ప్యార్' పాటను కూడా విడుదల చేసినట్లు పేర్కొంటూ ది వోకల్ న్యూస్ ప్రచురించిన వార్తను మేము కనుగొన్నాము. బాద్‌షాతో పాటు, ఆస్త గిల్ కూడా తన స్వరాన్ని అందించారు.
సహదేవ్ ఒకే ఒక్క పాటతో సంచలనంగా మారాడు. సోషల్ మీడియాలో సహదేవ్‌కు రూ .23 లక్షల విలువైన కారును బహుమతిగా ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఇది 5 లక్షలకు పైగా వీక్షణలను సాధించింది. సహదేవ్‌కు రూ .23 లక్షల విలువైన కారు లభించినట్లు వచ్చిన వార్త తప్పు అని నిరూపించబడింది.
'బాలీవుడ్ కేసరి' మీడియా సంస్థ ఫేస్బుక్ పేజీలో ఒక వీడియోను కనుగొన్నాము. వారు కూడా ఈ వైరల్ పోస్టులను తప్పు అని తేల్చేశారు. అతనికి రూ .21,000 మాత్రమే చెల్లించారని వారు చెప్పారు.
కాబట్టి ఎంజీ షోరూమ్ వాళ్ళు సహదేవ్ కు 23 లక్షల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇవ్వలేదు. వైరల్ అవుతున్న కథనాలు అవాస్తవాలు. పిల్లాడికి ప్రోత్సాహకంగా 21000 రూపాయలను నగదుగా ఇచ్చారు.