షారుఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం 'పఠాన్' చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ సినిమాను విడుదల చేయకూడదంటూ ఓ వర్గం పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఇక తాజాగా సోషల్ మీడియా వినియోగదారులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీవీలో షారుఖ్ ఖాన్ ఫోటోను చూస్తున్నట్లు షేర్ చేస్తున్నారు.
FIFA వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో షారుఖ్ ఖాన్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో చర్చ జరుగుతూ ఉండడాన్ని యోగి ఆదిత్యనాథ్ చూశారని సోషల్ మీడియా వినియోగదారులు పోస్టుల్లో చెబుతున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడిందని, అసలు ఫోటో యోగి ఆదిత్యనాథ్ FIFA ప్రపంచ కప్ మ్యాచ్‌ను చూస్తున్నట్లు ఉందని కనుగొంది.
వైరల్ ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము యోగి ఆదిత్యనాథ్ అధికారిక ట్విట్టర్ పేజీలో అసలు ఫోటోను కనుగొన్నాము. క్యాప్షన్ లో "#FIFAWorldCup" అని ఉంది. యోగి ఆదిత్యనాథ్ టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారని, షారుఖ్ ఖాన్‌ను కాదని స్పష్టంగా తెలుస్తోంది
మేము FIFA ప్రపంచ కప్ ఫైనల్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న SRK గురించి కీవర్డ్ సెర్చ్ ను కూడా నిర్వహించాము. షారుఖ్ ఖాన్ లైవ్ లో భాగంగా ప్రీ-మ్యాచ్ షోలో పాల్గొన్నారు, కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదని కనుగొన్నాము. ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే తమ కొత్త చిత్రం 'పఠాన్' ప్రమోషన్ కోసం ఖతార్‌లో జరిగిన FIFA వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లారు.
డిసెంబర్ 18న జియో సినిమా టెలికాస్ట్ చేసిన లైవ్ ప్రీ-మ్యాచ్ షో వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఈ వీడియోలో, దాదాపు 3.6 నిమిషాల వ్యవధి దగ్గర.. వైరల్ పోస్ట్‌లో యోగి ఆదిత్యనాథ్ టీవీ స్క్రీన్‌పై మార్ఫింగ్ చేసిన SRK కు సంబంధించిన అదే ఫ్రేమ్‌ని మేము కనుగొన్నాము.
యోగి ఆదిత్యనాథ్ టెలివిజన్‌లో షారుఖ్ ఖాన్ ను చూస్తున్న వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది. FIFA ప్రపంచ కప్ ఫైనల్‌లో SRK భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ధృవీకరించే నివేదికలు లేవు. కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.