FactCheck : రాహుల్ గాంధీ మందు, నాన్ వెజ్ తీసుకుంటున్నట్లు ఫోటోలు వైరల్..!

Morphed photo shows Rahul Gandhi enjoying alcohol, non-veg food during Bharat Jodo Yatra. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మద్యం, మాంసాహారం తీసుకుంటున్నారంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jan 2023 8:00 PM IST
FactCheck : రాహుల్ గాంధీ మందు, నాన్ వెజ్ తీసుకుంటున్నట్లు ఫోటోలు వైరల్..!

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మద్యం, మాంసాహారం తీసుకుంటున్నారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తూ పలువురు ట్విటర్ వినియోగదారులు ఈ చిత్రాన్ని షేర్ చేశారు. తపస్వీ.. తపస్సులో లీనమయ్యారంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు.


నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న ఫోటోలలో ఎటువంటి నిజం లేదు. ఫోటోలు మార్ఫింగ్ చేశారని స్పష్టమైంది.

ఒరిజినల్ ఫోటోలో రాహుల్ గాంధీ ఒక గ్లాసు టీ, డ్రై ఫ్రూట్స్‌ ప్లేట్స్ తో ఉన్నారు.

వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. అధికారిక భారత్ జోడో యాత్ర వెబ్‌సైట్‌లో జనవరి 7న ప్రచురించిన "భారత్ జోడో డైరీ" అనే కథనాన్ని మేము కనుగొన్నాము. "డైరీ"లో సీనియర్ జర్నలిస్ట్ పరంజోయ్ గుహా ఠాకుర్తా చేసిన ట్వీట్ ఉంది, అందులో అసలు ఫోటో ఉంది.

భారత్ జోడో యాత్రలో కర్నాల్‌కు కన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న డాబాలో భోజనం చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీని కలిశానని ఠాకుర్తా ఫోటోను ట్వీట్ చేశారు.

ఒరిజినల్ ఫోటోకు మార్ఫింగ్ చేసిన ఫోటోకు మధ్య ఉన్న తేడాను మీరు గమనించవచ్చు.


వైరల్‌ అవుతున్న ఫొటో మార్ఫింగ్‌ అని తేలింది. ఫోటో ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.


Claim Review:రాహుల్ గాంధీ మందు, నాన్ వెజ్ తీసుకుంటున్నట్లు ఫోటోలు వైరల్..!
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story