రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, కైసర్‌గంజ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారతీయ రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. సింగ్‌ను అరెస్టు చేసే వరకు నిరసనను విరమించేది లేదని చెబుతూ ఉన్నారు.
ఒక వైరల్ ఫోటోలో రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) చీఫ్ జయంత్ చౌదరి ఉండగా.. అందులో పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఉంది. రెజ్లర్లకు మద్దతుగా మియా ఖలీఫా నిరసనలో పాల్గొన్నట్లు పేర్కొంటూ ఫేస్‌బుక్, ట్విట్టర్ వినియోగదారులు ఫోటోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేసినట్లు న్యూస్ మీటర్ గుర్తించింది.
ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 27 ఏప్రిల్ 2023న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన అసలైన ఫోటో మాకు కనిపించింది. ఇందులో రెజ్లర్‌లతో పాటు జయంత్ చౌదరి కూడా ఉన్నారు. కానీ ఎక్కడా మియా ఖలీఫా కనిపించలేదు.
ట్విట్టర్ వినియోగదారు పోస్ట్ చేసిన అసలు ఫోటో మరియు మార్ఫింగ్ చేసిన ఫోటో కూడా మేము కనుగొన్నాము. కొందరు ఫోటోను మార్ఫింగ్ చేశారని ఆ ట్వీట్‌లో యూజర్ ఆరోపించారు.
నిరసన కార్యక్రమంలో జయంత్ చౌదరి మాట్లాడిన వీడియో కూడా మాకు దొరికింది. ఈ వీడియోను ధృవీకరించిన యూట్యూబ్ ఛానెల్ ఖబ్రైన్ అభి తక్ ఏప్రిల్ 27న ప్రచురించింది. వీడియోలో ఏ సమయంలోనూ మియా ఖలీఫా కనిపించలేదు.
వైరల్ ఫోటో మార్ఫింగ్ చేశారని.. మియా ఖలీఫా ఢిల్లీలో రెజ్లర్ల నిరసనలో పాల్గొన్నారనే వాదనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam