బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్.. నటి ఫాతిమా సనా షేక్ కలిసి ఉన్న ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతూ ఉంది. ఆమిర్ ఖాన్ కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయి. వారితో విడాకులు కూడా తీసుకున్నారు. ఇక మూడో భార్య ఫాతిమా సనా షేక్ అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు.
फातिमा शेख वही अभिनेत्री हैं जिन्होंने फिल्म दंगल में आमिर खान की बेटी का किरदार निभाया था। फिल्म में फातिमा ने गीता फोगाट की भूमिका अदा की थी। आज आमिर खान की तीसरी बेगम हो गई। 🥴
खैर ये उसका निजी मामला है। मगर ये ही आमिर खान सत्यमेव जयते प्रोग्राम बनाकर हिंदुओं की (1/5) pic.twitter.com/VZEIWcU0j3
అమీర్ ఖాన్ మరియు ఫాతిమా సనా షేక్ ఇద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకున్నారనే వాదనతో ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'దంగల్' చిత్రంలో అమీర్ ఖాన్ కూతురి పాత్రలో నటించిన ఫాతిమా అమీర్‌ను వివాహం చేసుకుని అతని "మూడవ భార్య"గా మారిందని ట్వీట్లు ఉన్నాయి.
फातिमा शेख वही अभिनेत्री हैं जिन्होंने फिल्म दंगल में आमिर खान की बेटी का किरदार निभाया था। फिल्म में फातिमा ने गीता फोगाट की भूमिका अदा की थी। आज आमिर खान की तीसरी बेगम हो गई। 🥴
— Thakur Ashutosh singh🇮🇳विक्की🇮🇳 (@Real18ashutosh) December 22, 2021
ఒక ఫోటో ఇద్దరూ సెల్ఫీ తీసుకున్నట్లు ఉండగా.. మరొకరు ఇద్దరూ కలిసి ఒక ఈవెంట్ కు హాజరైనట్లు ఉంది. 15 ఏళ్ల పాటు కలిసి ఉన్న అమీర్ ఖాన్, కిరణ్ రావు ఈ ఏడాది జూలైలో విడిపోయారు.
फातिमा शेख जिसने दंगल में आमिर खान की बेटी का किरदार निभाया था।।आज आमिर खान की तीसरी बेगम हो गई हैं...🥴खैर ये उसका निजी मामला है।।मगर यही आमिर खान टीवी सीरियल 'सत्यमेव जयते' बनाकर सामाजिक कुरीतियों जैसे बाल-विवाह, बहु-विवाह और दहेज प्रथा पर घड़ियाली आंसू बहाता है।। pic.twitter.com/NJECHFnInL
వైరల్ చిత్రం మార్ఫింగ్ చేయబడింది. ఒరిజినల్ ఫోటోలో కిరణ్ రావు అమీర్ ఖాన్ తో ఉన్నారు.
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించింది. Pinkvilla వెబ్‌సైట్‌లో అసలు చిత్రాన్ని కనుగొంది. ఈ ఫోటో జూలై 2018లో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నిశ్చితార్థ వేడుకలో తీయబడింది.
తమ రిలేషన్ షిప్ గురించి అమీర్, ఫాతిమా అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. ప్రస్తుతం, వారి సంబంధం గురించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడిందని, తప్పుడు వాదనలతో షేర్ చేయబడుతుందని స్పష్టమైంది.
కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
Claim Review:కుమార్తెగా నటించిన ఫాతిమా సనా షేక్ ను అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నాడంటూ వైరల్ పోస్టులు..?