FactCheck : సారా టెండూల్కర్, శుభమన్ గిల్ ఫోటో మార్పింగ్ చేశారు

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో ఉన్న చిత్రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2023 9:15 PM IST
FactCheck : సారా టెండూల్కర్, శుభమన్ గిల్ ఫోటో మార్పింగ్ చేశారు

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో ఉన్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారు తమ రిలేషన్ షిప్ ను ధృవీకరించారని అందులో పేర్కొన్నారు.

ఒక X వినియోగదారు ఈ చిత్రాన్ని షేర్ చేసి, “తాను శుభ్‌మాన్ గిల్‌తో డేటింగ్ చేస్తున్నట్లు సారా టెండూల్కర్ ధృవీకరించారు.” అంటూ పోస్టులు పెట్టారు.


ఒక ఫేస్ బుక్ యూజర్ కూడా అదే తరహాలో పోస్టును షేర్ చేశారు. “Love Bird #ShubhmanGill #SaraTendulkar.” అనే క్యాప్షన్ తో పోస్టును వైరల్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ బృందం ఈ చిత్రం మార్ఫింగ్ చేశారని కనుగొంది. అసలు ఫోటోలో సారా తన సోదరుడు అర్జున్ టెండూల్కర్‌తో కలిసి ఉంది.

మేము సారా, గిల్‌ల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాము.. కానీ వైరల్ ఫోటో కనుగొనలేదు. మేము సారా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆమె సోదరుడు అర్జున్‌తో కలిసి ఉన్న ఇదే తరహా ఫోటోను కనుగొన్నాము. తోబుట్టువులుగా సంవత్సరాల తరబడి పంచుకున్న జ్ఞాపకాల ఫోటోలను కూడా ఆమె పోస్టు చేసింది.

అర్జున్ పుట్టినరోజు సెప్టెంబర్ 24న ఈ ఫోటో పోస్ట్ చేశారు.“Baby bro turns 24 on the 24th!!! Happiest birthday Your sister has always got your back, (sic)” అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేసింది సారా.

ఒరిజినల్, మార్ఫింగ్ ఫోటోల మధ్య తేడాలను గమనించవచ్చు.


మేము సారా, గిల్ ఒకరితో ఒకరు డేటింగ్‌ని నిర్ధారించారా.. ఎప్పుడైనా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుర్తించారా అని కూడా మేము సెర్చ్ చేశాం. కానీ అలాంటి వార్తల నివేదిక ఏదీ కనుగొనలేదు. వారు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు ధృవీకరించినట్లయితే తప్పకుండా మీడియాలో కథనాలు వచ్చాయి.

గిల్‌తో సారా ఉన్న ఫోటో మార్ఫింగ్ చేశారని.. వారి రిలేషన్ షిప్ ను ధృవీకరించారనే వాదనలో ఎటువంటి నిజం లేదని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:సారా టెండూల్కర్, శుభమన్ గిల్ ఫోటో మార్పింగ్ చేశారు
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X, Facebook
Claim Fact Check:False
Next Story