భారతదేశం ఇటీవలే 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని అందుకుంది. భారతదేశం 100 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ మార్కును దాటిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు.
ప్రధాని మోదీలో ఒక మహిళ అసభ్యంగా సంజ్ఞ చేస్తున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో హెల్త్‌కేర్ వర్కర్ ప్రధాని పర్యటనలో అగౌరవంగా ప్రవర్తించారని ఓ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు.
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. వైరల్ ఫోటోను మార్ఫింగ్ చేశారు.
Prime Minister Narendra Modi gives a thumbs up to healthcare workers at Delhi's RML Hospital today morning as India crosses one billion COVID19 vaccinations pic.twitter.com/3HzhY6oNfX
న్యూస్ మీటర్ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. న్యూస్ ఏజెన్సీ ANI ట్వీట్ చేసిన అసలైన ఫోటోను కనుగొన్నారు. ఈ ట్వీట్‌లో "ఈ రోజు ఉదయం ఢిల్లీలోని RML హాస్పిటల్‌లో ఆరోగ్య కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ థంబ్స్ అప్ సింబల్ చూపించారు.. ఎందుకంటే భారతదేశం ఒక బిలియన్ COVID19 టీకాలు దాటింది." "Prime Minister Narendra Modi gives a thumbs up to healthcare workers at Delhi's RML Hospital today morning as India crosses one billion COVID19 vaccinations." అన్నది ట్వీట్.
ఒరిజినల్ ఫోటోలో స్త్రీ అసభ్యంగా సంజ్ఞ చేయడం లేదు, కానీ ఆమె చేతితో గాజును తాకుతోంది. మేము ఒరిజినల్ ఇమేజ్ మరియు వైరల్ ఇమేజ్‌ని పోల్చి చూసాము మరియు తేడాను గమనించాము. మీరు కూడా ఇక్కడ తేడాను చూడొచ్చు.
అమిత్ షాతో పాటూ మీడియా అవుట్ లెట్ Jagran కూడా ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒరిజినల్ ఫోటోలలో ఎక్కడా కూడా మోదీకి అసభ్యంగా చేతిని చూపించలేదు.
కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.. ఫోటోను మార్ఫింగ్ చేశారు.
Claim Review:ప్రధాని మోదీకి ఆరోగ్య సంరక్షణ కార్యకర్త అసభ్యంగా సంజ్ఞ చేస్తున్నారా..?