భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, రిషబ్ పంత్‌లకు సంబంధించిన పలు చిత్రాలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఫోటోలో ధోని పంత్‌ని ఆసుపత్రిలో కలిసినట్లు చూపిస్తోంది.
పంత్ ప్రమాదానికి గురైన తర్వాత ధోని పంత్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఫేస్‌బుక్ వినియోగదారులు వీడియోను పంచుకున్నారు. "MS ధోని ఉత్తరాఖండ్‌లో రిషబ్ పంత్‌ను కలిశాడు, మహి భాయ్‌ని చూసిన పంత్ భావోద్వేగానికి గురయ్యాడు" అని రాశారు. ("MS Dhoni met Rishabh Pant in Uttarakhand, Pant became emotional after seeing Mahi Bhai.") అని వైరల్ పోస్టులు పెడుతూ ఉన్నారు.
30 డిసెంబర్ 2022న, ఉత్తరాఖండ్‌లోని హైవేపై పంత్ ఘోర ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. 25 ఏళ్ల భారత వికెట్ కీపర్‌కు 6 జనవరి 2023న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స జరిగింది. పంత్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. వేగంగా కోలుకుంటున్నాడని పలు మీడియా సంస్థలు నివేదించాయి.
నిజ నిర్ధారణ :
పంత్ ను ధోని కలిసిన చిత్రం మార్ఫింగ్ అని న్యూస్‌మీటర్ కనుగొంది. ప్రమాదం తర్వాత ధోని పంత్‌ని కలిసిన వార్తా నివేదికలు కూడా మాకు కనిపించలేదు.
వైరల్ ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించినప్పుడు, అనేక వెబ్‌సైట్‌లు ప్రచురించిన అసలు ఫోటోను మేము కనుగొన్నాము. అసలు ఫోటో షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో ఒక చిన్నారిని కలుసుకున్నట్లు చూపిస్తుంది. 17 మే 2017న ప్రచురించిన ఖతార్ ట్రిబ్యూన్‌లోని ఒక నివేదిక ప్రకారం, UAE ఇయర్ ఆఫ్ గివింగ్ స్ఫూర్తికి అనుగుణంగా బాలీవుడ్ నటుడు అల్ జలీలా చిల్డ్రన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని చిన్నారులను పరామర్శించి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు.
9 మే 2017 న Government of Dubai Media Office అల్ జలీలా ఆసుపత్రికి SRK పర్యటనకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేసింది. క్యాప్షన్ ప్రకారం, "షారుఖ్ ఖాన్ ఆసుపత్రిలో పర్యటించారు, ఆసుపత్రి లోని సౌకర్యాలను చూసారు. కొంతమంది పిల్లలను కలుసుకుని వారి యోగక్షేమాలు గురించి అడిగి తెలుసుకున్నారు." అని ఉంది.
పెనిన్సులా ఖతార్ 17 మే 2017న ప్రచురించిన కథనంలో అసలు చిత్రాన్ని చూడొచ్చు.
పంత్‌తో ధోని ఉన్న వైరల్ చిత్రం మార్ఫింగ్ చేయబడింది.ప్రమాదం జరిగిన తర్వాత ధోని పంత్‌ను ఆసుపత్రిలో పరామర్శించినట్లు మాకు ఎలాంటి నివేదికలు దొరకలేదు. కాబట్టి, వైరల్ దావా తప్పు.