భారత ప్రధాని నరేంద్ర మోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఇటీవలే కలిశారు. ఆ సమావేశానికి శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా హాజరయ్యారని.. టీలను అందించారని ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
శివసేన పార్లమెంటు సభ్యుడు (ఎంపి) సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేబినెట్ మంత్రి అశోక్ చవాన్ లకు టీ కలుపుతున్నట్లుగా ఉన్న చిత్రం ట్విట్టర్లో వైరల్ అయ్యింది.
జూన్ 8 న న్యూ ఢిల్లీలోని ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఉద్ధవ్ థాక్రే కలిశారు. ఈ సమావేశం తర్వాత తరువాత ఈ చిత్రం వైరల్ అయ్యింది. "టీ అమ్మకందారుని 24 గంటలు టార్గెట్ చేస్తూనే విమర్శించే వ్యక్తి ... టీ తయారు చేస్తున్నాడు" అని పలువురు కామెంట్లు చేశారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేయబడినదని స్పష్టంగా తెలుస్తోంది.
న్యూస్‌మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇలాంటి ఫోటోను పలు మీడియా సంస్థలు పోస్టు చేశాయి. ఇక అన్ని మీడియా సంస్థల వార్తల్లో ఎక్కడా కూడా సంజయ్ రౌత్ కనిపించలేదు.
హిందుస్తాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, థాక్రే ఢిల్లీలో మోదీని కలిశారు. మహారాష్ట్రకు సంబంధించిన పలు విషయాలను మోదీతో మాట్లాడారు. మరాఠా మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు (ఓబిసి) రిజర్వేషన్లు, జిఎస్టి పరిహారం వంటి అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అరగంట పాటు కొనసాగిందని, ఇందులో పలు విషయాల గురించి మోదీతో మాట్లాడారని సీనియర్ శివసేన నాయకుడు తెలిపారు. ఆ సమావేశంలో సంజయ్ రౌత్ హాజరవ్వలేదు.
ఇక టీ కలుపుతున్నట్లుగా ఉన్న ఫోటోను ఎడిట్ చేశారు. భారతదేశంలో మొదటిసారి 21 రోజుల లాక్ డౌన్ ను ప్రారంభించినప్పుడు సంజయ్ రౌత్ నేలపై కూర్చుని హార్మోనియం వాయించినప్పుడు తీసిన ఫోటో. అదే ఫోటోను మోదీతో ఉద్ధవ్ థాక్రే సమావేశం సమయంలో వినియోగించారు. ఆయన ముందు టీ కప్పులను ఎడిట్ చేసి ఉంచారు.
https://www.google.com/amp/s/www.loksatta.com/maharashtra-news/bjp-nilesh-rane-criticize-shiv-sena-leader-sanjay-raut-over-harmonium-lockdown-twitter-jud87-2116146/lite/
https://zeenews.india.com/marathi/mumbai/coronavirus-shivsena-mp-sanjay-raut-quarantine-with-harmonium/514024
ప్రధాని మోదీ, ఉద్ధవ్ థాక్రే సమావేశంలో సంజయ్ రౌత్ 'టీ' లను అందించారన్నట్లుగా వైరల్ అవుతున్న ఫోటోను 'ఎడిట్ చేశారు'. ఈ ఫోటోలో ఎటువంటి నిజం లేదు.