ఆజ్ తక్ నిర్వహించిన సర్వేలో రాహుల్ గాంధీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా చూపించిందంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. "మూడ్ ఆఫ్ ది నేషన్" సర్వేలో రాహుల్ గాంధీకి 52%, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి 46% ఓట్లు వచ్చాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగా రాహుల్ గాంధీకి పాపులారిటీ పెరిగిపోతోందని.. గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారని సోషల్ మీడియా యూజర్లు గ్రాఫిక్‌ని షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం YouTubeలో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. "ఆజ్ తక్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్" పేరుతో ఆజ్ తక్ ప్రోగ్రామ్ యొక్క వీడియోను కనుగొంది. ఇది 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రసారం చేయబడింది. 24 జనవరి 2019న YouTubeలో అప్లోడ్ లో చేశారు.
పోల్ సర్వే ప్రశ్న "ప్రతిపక్ష నాయకులలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తమ ప్రత్యామ్నాయం ఎవరు?" అని ఉంది. అయితే అందులో రాహుల్ గాంధీ 52% ఆధిక్యంలో ఉన్నారు, మమతా బెనర్జీ 8%, అఖిలేష్ యాదవ్ 5%, అరవింద్ కేజ్రీవాల్ 4%, మాయావతి 3% తో ఉన్నారు.
పోల్ సర్వే ప్రశ్నపై "తదుపరి ప్రధానమంత్రి ఎవరు?" అని ఉండగా.. ప్రధాని మోదీ 46% ఆధిక్యంలో ఉండగా, రాహుల్ గాంధీ 34% ఆధిక్యంలో ఉన్నారు.
భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీ ప్రధాని మోదీని మించిపోయిందని ఈ రెండు పోల్ సర్వేల గ్రాఫిక్స్ కలిపి చూపించారు. పాపులారిటీ పెరిగిపోయిందని చెబుతూ వస్తున్నారు.
అక్టోబర్ 13న ఢిల్లీ కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ కూడా మార్ఫింగ్ చేసిన గ్రాఫిక్‌ని ట్వీట్ చేసి దేశం మూడ్ మారుతోందని పేర్కొంది. అయితే, ఆజ్ తక్ ఢిల్లీ కాంగ్రెస్ కు అలాంటి సర్వేలేవీ నిర్వహించలేదని, గ్రాఫిక్ ఫోటోషాప్ చేయబడిందని స్పష్టం చేయడంతో ట్వీట్ తొలగించింది కాంగ్రెస్ విభాగం.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.