భారతదేశ లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ కు గత నెలలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన కరోనా మహమ్మారితో పోరాడుతూ ఉన్నారు. అయితే ఎంతో మంది నెటిజన్లు ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. కోవిద్-19 కారణంగా మిల్కా సింగ్ చనిపోయారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ పలువురు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు.

"Flying Sikh Milkha Singh passed away due to Covid RIP" అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు షేర్ చేయడం మొదలు పెట్టారు.

నిజనిర్ధారణ:

మిల్కా సింగ్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

మిల్కా సింగ్ ఆరోగ్యం గురించి న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా.. ఆయనకు చనిపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. నాలుగు సార్లు ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డారన్న వార్త తప్పితే ఆయన మరణించారని ఎటువంటి వార్తను కూడా ప్రచురించలేదు.

చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రిలోని కోవిద్ వార్డులో ఉన్న ఐసీయులో మిల్కా సింగ్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగవుతూ ఉందని కుటుంబ సభ్యులు జూన్ 7న అధికారికంగా తెలిపారు. 91 సంవత్సరాల మిల్కా సింగ్ ఆయన భార్య 82 సంవత్సరాల నిర్మల కౌర్ ల ఆరోగ్యం మెరుగుపడుతోందని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. మిల్కా సింగ్ ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని అన్నారు.

మిల్కా సింగ్ కుమారుడు జీవ్ మిల్కా సింగ్ కూడా తన తండ్రి ఆరోగ్యం బాగుందని తెలిపారు. జూన్ 4 న తన తండ్రి ఆరోగ్యం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి కనుక్కున్నారనే ట్వీట్ ను తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేశారు.

కేంద్ర క్రీడా శాఖా మంత్రి కిరణ్ రిజిజు 'మిల్కా సింగ్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టులను తీవ్రంగా తప్పుబట్టారు'. ఆయన ఆరోగ్యం గురించి వదంతులను సృష్టించకండని తెలిపారు. ఆయన వేగంగా కోలుకోవాలని ఆశిద్దామని కిరణ్ రిజిజు కోరారు.

కరోనా కారణంగా మిల్కా సింగ్ చనిపోయారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్‌మీటర్ తెలుగు

Next Story